Begin typing your search above and press return to search.
ఇండియన్ సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్న ప్రభాస్..!
By: Tupaki Desk | 27 Sep 2021 3:31 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసి, మరో మూడు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్స్ ద్వారా సరికొత్త టెక్నాలజీని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేయబోతున్నారు. నాలుగు సినిమాలను నాలుగు విభిన్నమైన సాంకేతికతో రూపొందిస్తూ.. భారతీయ సినీ ప్రియులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ను అందించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ''రాధే శ్యామ్''. యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గోపీకృష్ణ మూవీస్ సంస్థలు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పీరియాడికల్ లవ్ స్టొరీని తెరకెక్కిస్తున్నారు. దీన్ని వర్చువల్ ప్రొడక్షన్ లో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీతో వస్తోన్న తొలి ఇండియన్ సినిమాగా 'రాధే శ్యామ్' సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనుంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''సలార్''. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా నిర్మాణంలో హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 'మ్యాట్రిక్స్' 'బ్యాట్ మ్యాన్' వంటి హాలీవుడ్ చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీతో 'సలార్' చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే భారతదేశపు మొట్టమొదటి బ్లాక్ థీమ్ సినిమాగా 'సలార్' నిలుస్తుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ''ఆది పురుష్''. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 3-డీలో రూపొందే ఈ మైథలాజికల్ డ్రామా కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీతగా కృతి సనన్ నటిస్తోంది. ప్రతినాయకుడు లంకేశ్ గా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. టీ-సిరీస్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఇకపోతే ఇటీవల నాగ్ అశ్విన్ తో ''ప్రాజెక్ట్ K'' అనే పాన్ వరల్డ్ చిత్రాన్ని కూడా ప్రభాస్ సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇది సైన్స్ ఫిక్షన్ - సోషియో ఫాంటసీ జోనర్ సినిమా. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ - అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మొత్తం ఆరీ అలెక్సా 65 అనే కెమెరాను ఉపయోగించి తీయబోతున్నారని తెలుస్తోంది. నవంబర్ లో ఈ సినిమా తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లి ఏకధాటిగా ఏడాది పాటు షూటింగ్ చేయనున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనే నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇలా ప్రభాస్ తన అప్ కమింగ్ సినిమా సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి రెడీ అయ్యారని చెప్పవచ్చు.