Begin typing your search above and press return to search.
ప్రభాస్ ని ఓ రేంజ్లో వాడేస్తున్నారుగా
By: Tupaki Desk | 1 Jan 2022 3:30 AM GMTజపాన్ ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన హీరో తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమా వచ్చిందంటే చాలు జపాన్ వాసులు చేసే హంగామా మామూలుగా వుండదు. గత కొన్నేళ్లుగా రజనీ సినిమాకు అక్కడి వారు బ్రహ్మరథం పడుతూనే వున్నారు. అయితే తాజాగా ఆ లిస్ట్ లో కొత్త హీరో చేరిపోయాడు. అతడే మన గ్లోబల్ స్టార్ ప్రభాస్. `బాహుబలి` చిత్రం జపాన్లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ ఆజాను భాహుడిలా కనిపించిన తీరు, లుక్, పలికించిన హావ భావాలకు జపాన్ యూత్ క్లీన్ బౌల్డ్ అయ్యారు.
దీంతో అప్పటి నుంచి ప్రభాస్ సినిమా అంటే చాలు పని గట్టుకుని మరీ తమ దేశంలో ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులతో పాటు ఈ జాబితాలో మీడియా వర్గాలు కూడా భారీ స్థాయిలో చేరడంతో మన హీరోకు అక్కడ పబ్లిసిటే పబ్లిసిటీ. `బాహుబలి`తో ప్రభాస్ కు జపాన్ వాసులు తమ గుండెల్లో గుడి కట్టేసుకున్నారట. అందుకే అక్కడి మీడియాలోని ఓ వర్గం, సగటు సినీ ప్రియులు ప్రభాస్ సినిమా వస్తోందంటే హడావిడి చేయడం పరిపాటిగా మారిపోయింది.
`బాహుబలి` విడుదలై ఇప్పటికి చాలా కాలమే అవుతున్నా ప్రభాస్ పై జపాన్ వాసుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఇంకా పెరిగింది. ఇప్పుడు అదే `రాధేశ్యామ్` పాలిట వరంగా మారుతోంది. ఈ మూవీ జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచారాన్ని జపాన్ లో ఆయన అభిమానులు హోరెత్తిస్తున్నారు. చిత్ర టీమ్ కు సంబంధం లేకుండా తమ అభిమాన హీరో సినిమాకు భారీ స్థాయిలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ ఫొటో జపాన్ కు చెందిన కూల్ డ్రింక్ బాటిల్స్ పై క్రేట్ పై వుండటం నెట్టింట వైరల్ గా మారింది. ఆ సీసాల లేబుల్స్ పై ప్రభాస్ మిల్క్ తాగుతున్న ఫొటో వుండటం విశేషం. దీన్ని బట్టే ప్రభాస్ అంటే జపాన్ వాసుల్లో ఎంత క్రేజ్ వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బాటిల్స్ జపాన్లోని ఐకియా స్టోర్ లో అమ్ముడవుతున్నాయి. ఈ బాటిల్స్ లేబిల్స్ పై ప్రభాస్ `రాధేశ్యామ్` ట్రైలర్ పిక్ వుండటం గమనార్హం.
ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ అనుమతి లేకుండానే ఇలా జపాన్ ఐకియా స్టోర్లో ప్రభాస్ `రాధేశ్యామ్` ట్రైలర్ పోస్టర్ లోని ప్రభాస్ ఫొటోస్ అంటించిన బాటిల్స్ విక్రయిస్తుండటంతో సినిమా కు భారీ పబ్లిసిటీ లభిస్తోందని చెబుతున్నారు. ఇదిలా వుంటే గతంలో జపాన్ వాసులు `బాహుబలి` టైమ్ లో ఈ సినిమాలోని పాత్రలకు సంబంధించిన ఆర్ట్ మెటీరియల్ ని చిత్ర బృదానికి అందించారట. ఈ సారి కూడా `రాధేశ్యామ్` టీమ్ కు జపాన్ వాసులు మరో బహుమతిని అందించడం ఖాయంగా కనిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
`రాధేశ్యామ్`లో ప్రభాస్ హస్త సాముద్రికుడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ప్రేమించిన ప్రేమే ప్రేమని బలికోరుతుందన్న కాన్సెప్ట్ తో సరికొత్త నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని మేకింగ్ తో `టైటానిక్` లవ్ స్టోరీకి ఇండియన్ న్యూ వెర్షన్ అనే విధంగా ఈ చిత్ర ట్రైలర్ సినిమా కథేంటో చెప్పకనే చెప్పేసింది.