Begin typing your search above and press return to search.

ప్రభాస్ నిజంగా డార్లింగ్‌ అనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు

By:  Tupaki Desk   |   23 Oct 2020 2:30 PM GMT
ప్రభాస్ నిజంగా డార్లింగ్‌ అనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు
X
ఇండస్ట్రీలో చాలా మంది ప్రభాస్‌ ను డార్లింగ్‌ అని పిలుస్తూ ఉంటారు. ఆయన కూడా తనకు ఆప్తులు అయిన అభిమానులను డార్లింగ్స్‌ అంటూ ఉంటారు. అలాంటి అభిమానంను కలిగి ఉన్న ప్రభాస్‌ పైకి ఎలా కనిపించినా లోపల మాత్రం చిన్న పిల్లాడి మనస్థత్వం. చిన్న పిల్లాడి మాదిరిగా మొహమాట పడటంతో పాటు సాయం చేయాల్సి వచ్చిన సమయంలో రాజు లా తనవంతు బాధ్యతను నెరవేర్చుతాడు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక పీఆర్‌ ఓ మాత్రం తనకు ప్రభాస్‌ తో ఎదురైన ఒక అనుభవంను షేర్‌ చేసుకున్నాడు.

సాహో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాత్రి పన్నెండు గంటల వరకు బిజి బిజీగా సాగిన ఆయన ఆ తర్వాత రెండు గంటల వరకు ఫొటోలు దిగాడు. అప్పటికే రెండు వందల మంది వరకు ఆయనతో ఫొటోలు దిగారు. పార్క్‌ హయత్‌ లో ఆయన కోసం వచ్చిన వారందరితో ఫొటోలు దిగాడు. అర్థరాత్రి దాటి రెండు గంటలు అయిన సమయంలో బయటకు వెళ్తున్నాడు. ఆ సమయంలో ఒక 10 మందితో కూడిన ఫ్యామిలీ ప్రభాస్‌ కోసం వెయిట్‌ చేస్తుంది. ఆ విషయాన్ని గమనించిన ప్రభాస్‌ వెంటనే అక్కడ దిగేసి వారిని హగ్‌ చేసుకుని మరీ ఫొటో దిగాడు. అది నిజంగా చాలా గొప్ప విషయం. ప్రభాస్‌ నిజంగా డార్లింగ్‌ అనడానికి ఇంతకు మించి ప్రత్యక్ష సాక్ష్యం ఏమీ లేదని అభిమానులు అంటున్నారు.