Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్' కి క్రేజ్ రావడానికి ఏకైక కారణం..?

By:  Tupaki Desk   |   15 Nov 2021 7:31 AM GMT
రాధే శ్యామ్ కి క్రేజ్ రావడానికి ఏకైక కారణం..?
X
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు పాన్ ఇండియా సినిమాలు రాబోయే రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భారీ స్థాయిలో రూపొందిన 'ఆర్.ఆర్.ఆర్' - 'రాధే శ్యామ్' 'పుష్ప' సినిమాలు క్రిస్మస్ - సంక్రాంతి సీజన్లలో విడుదలకు సిద్ధం అయ్యాయి.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన చిత్రం RRR మూవీ 2022 జనవరి 7న రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'రాధే శ్యామ్' సినిమా జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప: ది రైజ్' మూవీ 2021 డిసెంబర్ 17న విడుదల అవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే ఈ మూడు క్రేజీ మూవీస్ ఇప్పటికే ప్రమోషన్స్ వేగవంతం చేయడానికి ప్లాన్స్ చేసుకున్నాయి. వాటిలో 'పుష్ప' ముందుగా పుష్ప వస్తుంది కాబట్టి.. ప్రమోషన్స్ లో కూడా కాస్త ముందుంది. RRR రెండు నెలల ముందుగానే గహడావిడి చేస్తుండగా.. 'రాధే శ్యామ్' మాత్రం ఫస్ట్ సింగిల్ అంటూ ఇప్పుడిప్పుడే ప్రచార కార్యక్రమాలు మొదలు పెడుతోంది.

'పుష్ప' సినిమాకి ఇంతటి క్రేజ్ రావడానికి కారణం అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ అని చెప్పాలి. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ ఉండటానికి రాజమౌళితో పాటుగా ఇద్దరు హీరోలు చరణ్ - తారక్ కారణమని అనుకోవాలి. కానీ 'రాధేశ్యామ్' కి ఇంతటి క్రేజ్ రావడానికి ఏకైక కారణం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన డార్లింగ్ ప్రభాస్.. 'సాహో' చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ప్రస్తుతం వరుసగా భారీగా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్న ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పీరియాడికల్ లవ్ డ్రామా అయినప్పటికీ.. యాక్షన్ సినిమాల మాదిరిగానే అంచనాలు నెలకొన్నాయి.

'రాధే శ్యామ్' సినిమా 1970స్ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడింది. ఇందులో ప్రభాస్ చేయి చూసి భవిష్యత్ చెప్పగలిగే విక్రమాదిత్య అనే పామిస్ట్ గా కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం ప్రభాస్ ఈ చిత్రంలో చాలా అందంగా కనిపించబోతున్నాడు. ఒక ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ సినిమా రెడీ అవుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలవనుందని టాక్.

ప్రభాస్ కు జోడీగా ప్రేరణ అనే పాత్రలో పూజాహెగ్డే కనిపించనుంది. భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్.. హిందీ వెర్షన్ కు మిథున్ మనస్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు.

'రాధే శ్యామ్' చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గీతాకృష్ణ సంస్థలు కలసి భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - భూషణ్ కుమార్ - ప్రశీద దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీతో పాటుగా చైనీస్ జపనీస్ వంటి విదేశీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.