Begin typing your search above and press return to search.
భన్సాలీ ఫోకస్ మోదీ బయోపిక్ పైకి!
By: Tupaki Desk | 17 Sep 2019 3:31 PM GMTభారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ `పీఎం నరేంద్రమోదీ` పేరుతో బయోపిక్ ని తెరకెక్కించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. అయితే ఆ బయోపిక్ తో సంబంధం లేకుండా మరో బయోపిక్ ని బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి `మనోవిరాగి` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రివీలైంది. తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ ని డార్లింగ్ ప్రభాస్ లాంచ్ చేయగా.. హిందీ వెర్షన్ ఫస్ట్ లుక్ ను కిలాడీ అక్షయ్ కుమార్ విడుదల చేశారు.
``ప్రత్యేక వ్యక్తిపై ప్రత్యేక నిర్మాతలు తీస్తున్న ప్రత్యేక సినిమా ఫస్ట్ లుక్ ను ప్రత్యేకమైన రిలీజ్ చేస్తున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు మోదీ సర్. సంజయ్ లీలా భన్సాలీ.. మహవీర్ జైన్ కాంబినేషన్ మూవీ లుక్ విడుదల చేయడం సంతోషం. ఇది ప్రధాని అన్ టోల్డ్ స్టోరీ. సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు`` అని ప్రభాస్ ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఒక సామాన్య ఛాయ్ వాలా దేశ ప్రధానిగా ఎదిగిన స్ఫూర్తివంతమైన జర్నీని పెద్ద తెరపై చూపించబోతున్నారు. భన్సాలీ లాంటి గ్రేట్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన తెరకెక్కించిన గత చిత్రాల్లానే ఈ బయోపిక్ లోనూ ఎమోషనల్ కంటెంట్ హైలైట్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భన్సాలీ మీడియాతో మాట్లాడుతూ-``ఈ కథ కోసం చాలా పరిశోధనలు చేశాను. యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రధాని మోదీ జీవితం మలుపు తిరిగిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది అందరికీ తెలియని కథ.. తెలుసుకోవాల్సిన కథ. ఆయన యుక్తవయసు సంఘటనలు తెరపై చూపిస్తున్నా`` అని తెలిపారు. వాస్తవానికి సల్మాన్ కథానాయకుడిగా భన్సాలీ దర్శకత్వంలో `ఇన్షా అల్లా` తెరకెక్కాల్సింది. కానీ ఆ ప్రాజెక్టు క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆగిపోవడంతో భన్సాలీ ప్రస్తుతం మోదీ బయోపిక్ పై ఫోకస్ చేస్తున్నారన్నమాట.