Begin typing your search above and press return to search.
ప్రభాస్ మారాడు.. నాలుగేళ్ల తర్వాత
By: Tupaki Desk | 16 March 2017 11:03 AM GMTఎప్పుడు చూసినా పొడవాటి జుట్టు.. మెలి తిరిగిన మీసం.. నాలుగేళ్లుగా ప్రభాస్ ఎక్కడ కనిపించినా ఇదే లుక్. ఈ లుక్ ఎంత బాగున్నప్పటికీ.. మళ్లీ మళ్లీ అతణ్ని అదే అవతారంలో చూసి కొంచెం బోర్ కొట్టేసింది జనాలకు. ‘బాహుబలి: ది బిగినింగ్’కు.. ‘బాహుబలి: ది కంక్లూజన్’కు మధ్య ఆరు నెలలకు పైగా గ్యాప్ వచ్చినా ప్రభాస్ లుక్ మార్చలేదు. చివరికి ‘ది కంక్లూజన్’ పూర్తయ్యాక కూడా వెంటనే వేరే లుక్ లోకి మారలేదు. ఐతే ఎట్టకేలకు ప్రభాస్ లుక్ మారింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ప్రభాస్ సరికొత్త లుక్ లో వచ్చాడు.
జుట్టు షార్ట్ గా కత్తిరించుకుని.. మీసం ట్రిమ్ చేసుకుని కొత్త అవతారంలోకి మారిపోయాడు ప్రభాస్. ఈ మార్పు సుజీత్ దర్శకత్వంలో తాను చేయబోయే తర్వాతి సినిమా కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఆలోపు ప్రభాస్ లుక్ లో మరిన్ని మార్పులు ఉంటాయట. ‘బాహుబలి’ కోసం భారీగా తయారైన ప్రభాస్.. సుజీత్ చిత్రం కోసం బరువు కూడా తగ్గనున్నాడు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయేది జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభాస్ తన లుక్ ను మార్చుకోనున్నాడు. ఈ సినిమాలో సరికొత్తగా.. స్టైలిష్ గా కనిపిస్తాడట ప్రభాస్. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ ను ఇలా చూడటం అభిమానులకు కొత్తగా అనిపించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/