Begin typing your search above and press return to search.
ప్రభాస్ మౌనం వెనక టాప్ 3 రీజన్స్
By: Tupaki Desk | 2 Feb 2020 6:24 AM GMTడార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా జాన్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్- గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ 20వ సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించే 21వ సినిమాకి సంబంధించి సరైన అప్ డేట్ లేదు. ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు ప్రభాస్ కి అడ్వాన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. డార్లింగ్ ఎందుకనో మరో కమిట్ మెంట్ ఇచ్చే మూడ్ లో లేదు.
ఇప్పటికే అగ్ర నిర్మాత దిల్ రాజు చాలా కాలంగా ప్రభాస్ కాల్షీట్ల కోసం వేచి చూస్తున్నారు. పలువురు టాప్ ప్రొడ్యూసర్స్ డార్లింగ్ ఓకే అంటే వెంటనే సినిమా మొదలెట్టేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అటు బాలీవుడ్ లోనూ స్ట్రెయిట్ సినిమాలు చేసేందుకు కరణ్ జోహార్ .. యశ్ రాజ్ సహా పలు అగ్ర నిర్మాణ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. అయితే డార్లింగ్ మాత్రం ఎందుకనో నోనో అనేస్తున్నాడట.
అసలు ప్రభాస్ మైండ్ లో ఏం ఉంది? ఎందుకు అంత భారీ ఆఫర్లను కాదనేస్తున్నాడు? అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. టాప్ 3 రీజన్స్ గురించి ఆరా తీస్తే.. అందులో మొదటిది ఇక డార్లింగ్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఇంట్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. అలాగే ఇప్పుడు సెట్స్ పై ఉన్న జాన్ చిత్రంపై పూర్తి క్లారిటీ వచ్చే వరకూ ప్రభాస్ ఎంతమాత్రం వేరొక కమిట్ మెంట్ కి అంగీకరించే ఆలోచనలో లేడు. పాన్ ఇండియా చిత్రం సాహో ఫ్లాపవ్వడంతో జాన్ విషయంలో కాస్త తర్జనభర్జన పడిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ కొట్టి తారాలన్న కసితో ఉన్నాడు. ఇక మూడోది బాలీవుడ్ నుంచి యశ్ రాజ్ ఫిలింస్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ ధూమ్ సిరీస్ కొత్త సినిమాని ప్రారంభించేందుకు సన్నాహకాల్లో ఉంది. ఈ సినిమాకి ప్రభాస్ పేరు పరిశీలనలో ఉండడం కూడా అతడు మరో సినిమాని అంగీకరించకపోవడానికి కారణమని భావిస్తున్నారు. మొత్తానికి ఈ మూడు కారణాల్లో ఒకటి డార్లింగ్ ని లాక్ చేసిందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దేనికైనా ప్రభాస్ స్వయంగా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.