Begin typing your search above and press return to search.
తెలుగు దర్శకుడితో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ
By: Tupaki Desk | 25 Feb 2020 11:30 AM GMTబాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ కే పరిమితం అవ్వకుండా సౌత్ ఇండియా మొత్తం మరియు బాలీవుడ్ కు కూడా పాకింది. బాహుబలి చిత్రం తర్వాత సాహో చిత్రాన్ని చేసిన ప్రభాస్ ఆ చిత్రంతోనూ అక్కడ సత్తా చాటాడు. సాహో చిత్రం తర్వాత ప్రభాస్ హిందీ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కాని రాధాకృష్ణ దర్శకత్వంలో తెలుగు సినిమానే ప్రభాస్ చేస్తున్నాడు. ఓ డియర్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను హిందీలో డబ్ చేయబోతున్నారు.
ఓ డియర్ చిత్రం తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమా డైరెక్ట్ హిందీ సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ హిందీ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నది తెలుగు డైరెక్టర్ గా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో టీ సిరీస్ వారు ఒక హిందీ సినిమాను ప్లాన్ చేశారు. పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలను సంప్రదించారట. కాని ప్రస్తుతానికి ఎవరు అందుబాటులో లేకపోవడంతో ప్రభాస్ తో ఆ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారట.
ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెలుగు.. హిందీ సినిమాను నిర్మించడం వల్ల డబుల్ ప్రాఫిట్ దక్కే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమ్మర్ చివర్లో ఈ కాంబో మూవీని ప్రకటించనున్నారు. వచ్చే ఏడాదిలోనే సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. తెలుగులో మరియు హిందీలో వేరు వేరుగా సినిమాను షూట్ చేయబోతున్నారు. గతంలో జంజీర్ చిత్రాన్ని తెలుగులో తుఫాన్‌గా ఎలా తీశారో అలా ఈ సినిమాను కూడా రెండు భాషల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టీ సిరీస్ వారితో కలిసి యూవీ క్రియేషన్స్ వారు కూడా ఈ ద్విభాష చిత్రంలో నిర్మాణ భాగస్వామి కాబోతున్నారు.