Begin typing your search above and press return to search.
రిలీజ్ వెర్షన్ లో ప్రభాస్ మార్క్ ఛేంజెస్
By: Tupaki Desk | 6 Feb 2022 9:39 AM GMTసినిమా మొత్తం పూర్తయిన తర్వాత రిలీజ్ వెర్షన్ కాపీ చూసి అందులో మార్పులు.. చేర్పులు కోరే హీరోలు టాలీవుడ్ లో కొందరు ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...సూపర్ స్టార్ మహేష్ లాంటి వారు తుది కాపీ ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చూసుకుంటున్నారు. ఎడిటింగ్ వెర్షన్ లో మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటే దర్శకుడికి సూచిస్తుంటారు. సినిమాని వీలైనంత ఎక్కువసార్లు చూసుకున్నప్పుడు ఈ ఐడియాలజీ వర్కౌట్ అవుతుంటుంది. ఆ రకంగా సినిమాని దర్శకుడితో పాటు చూసే హీరోలు వీళ్లంతా. ఆ రకంగా సినిమా సక్సెస్ లో హీరోల ఎనాలసిస్ కీలక పాత్ర పోషిస్తోంది.
తాజాగా ఆ వరుసలోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా చేరారు. ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` విడుదలకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ వెర్షన్ ప్రభాస్ చూసి మార్పులు కోరినట్లు సమాచారం. స్క్రీన్ ప్లే మరింత క్రిస్పీగా ఉండేలా ఎడిట్ ప్యాటర్న్ లో కొన్ని మార్పులు చేయమని డార్లింగ్ డైరెక్టర్ కి సూచించినట్లు సమాచారం. మరి డార్లింగ్ ఛేంజెస్ ఎక్కడెక్కడ కోరారు? అన్నది తెలియాలి. క్రియేటివిటీ పరంగా ఇలాంటి మార్పులు ఎవరికి ఇబ్బంది కరమైనవి కావు. ఎడిటింగ్ టేబుల్ పై జరిగే మార్పులు కాబట్టి ఆమోదయోగ్యమైనవే.
సినిమా నిడివి తగ్గించడానికి వీలైనంత ట్రిమ్ చేయడానికే మేకర్లు ప్రయత్నిస్తుంటారు. అయితే మేకర్ ఐడియాలజీని హీరోలు క్రాస్ చేసి వెళితేనే ఇబ్బంది. ఇప్పటివరకూ చిరంజీవి..బన్నీ కారణంగా ఏ దర్శకుడు ఇబ్బంది పడిన సన్నివేశం లేదు. అయితే మహేష్.. పవన్ తో దర్శకులకు చిన్నపాటి క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తిన సందర్భాలున్నాయి. కానీ అవన్నీ అప్పటికప్పుడే క్లియర్ అయ్యాయి. మరి ప్రభాస్ ఇప్పుడే రంగంలోకి దిగారు కాబట్టి మేకర్ పై అతని ఒత్తిడి ఎలా ఉంటుంది? అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది.