Begin typing your search above and press return to search.

ప్రభాస్ మార్కెట్ వాల్యూ ఎంతో తేల్చే టైమ్ వచ్చింది..!

By:  Tupaki Desk   |   6 March 2022 8:30 AM GMT
ప్రభాస్ మార్కెట్ వాల్యూ ఎంతో తేల్చే టైమ్ వచ్చింది..!
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. నేషనల్ వైడ్ వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటున్నారు.

'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో' సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టకపోయినా.. హిందీ వెర్సన్ మాత్రం భారీ కలెక్షన్స్ సాధించింది. దీంతో డార్లింగ్ స్టామినా ఏంటో బాలీవుడ్ బాక్సాఫీస్ కు తెలిసొచ్చింది.

ఈ నేపథ్యంలో ఇండియాలో అగ్ర నిర్మాణ సంస్థలన్నీ ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరిచారు. అప్పటి నుంచి డార్లింగ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.

సినిమా ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు విడుదల అవుతుందనేది పక్కన పెడితే.. ప్రభాస్ మాత్రం తన వద్దకు వచ్చిన వాటిలో బెస్ట్ అనుకున్న స్క్రిప్ట్స్ ఓకే చేస్తున్నారు. తన క్రేజ్ కు తగ్గట్టుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఇండియాలో మరో స్టార్ హీరో వద్ద లేవని అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ సినిమా కూడా అత్యధిక బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్నదే కావడం గమనార్హం.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఇప్పటిదాకా ఈ మూవీ బడ్జెట్ రూ.200 కోట్ల లోపే అనుకుంటున్నారంతా. కానీ ఈ పీరియాడికల్ ప్రేమ కథా చిత్రానికి రూ.300 కోట్ల పైనే ఖర్చు చేశారని తెలుస్తోంది.

ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డార్లింగ్ నోటితోనే 'రాధేశ్యామ్' బడ్జెట్ ఎంతో బయటపెట్టారు. సినిమా వివరాలు అడిగిన ఓ విలేఖరికి బదులిస్తూ.. నిర్మాతలు రూ. 300 కోట్లు ఖర్చు చేసారని.. ఇప్పుడు తాను మూవీ క్లైమాక్స్ గురించి చెప్తే చంపేస్తారని ప్రభాస్ అన్నారు.

అందుకే కనీసం రూ.50 టిక్కెట్ అయినా కొనుక్కుని సినిమా చూసి రాధేశ్యామ్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకోవాలని ప్రభాస్ సూచించారు. మొత్తానికి మీడియా ముఖంగా చిత్ర బడ్జెట్ ఎంత అన్నది వెల్లడించేశారు. ఒక లవ్ డ్రామాకి 300 కోట్లు పెట్టారంటే హీరో రేంజేంటన్నది అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు 'రాధేశ్యామ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్ళు రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దీని తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ అంతకుమించి బడ్జెట్ తో రూపొందుతున్నవే.

మైథిలాజీ జోనర్ లో 'ఆదిపురుష్'.. బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా 'సలార్' చిత్రాలు తెరకెక్కుతుండగా.. పాన్ వరల్డ్ మూవీగా భారీ బడ్జెట్ తో 'ప్రాజెక్ట్ K' మూవీ రూపొందుతోంది. ఇదే క్రమంలో 'స్పిరిట్' వంటి క్రేజీ ప్రాజెక్ట్ కూడా డార్లింగ్ లైనప్ లో ఉంది. మరి ఈ చిత్రాలతో ప్రభాస్ రేంజ్ ఏంటో ఇండియన్ బాక్సాఫీస్ కు మరోసారి తెలిసొస్తుందేమో చూడాలి.