Begin typing your search above and press return to search.
ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా?
By: Tupaki Desk | 24 Sep 2015 11:56 AM GMTయంగ్ రెబల్ ప్రభాస్ పెళ్లెప్పుడు .. దీనికి సమాధానం అంత వీజీగా దొరికేట్టే లేదు. టాలీవుడ్ లో ఒక్కో యంగ్ హీరో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోతున్నా ఈ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి ఊసెత్తడం లేదు. పెళ్లి అన్న మాట ఎత్తితే ఆమడ దూరం పారిపోతున్నాడు. ఏదైనా మాట్లాడితే కెరీర్ గురించి తప్ప వ్యక్తిగత సంగతుల్ని అస్సలు షేర్ చేసుకోవడం లేదు. అయితే బెండముదిరితే ప్రాబ్లెమ్ అని పెద్దలు అంటుంటారు. మరి ప్రభాస్ సమస్యేంటి?
యువహీరోలు అల్లరి నరేష్ - మంచు మనోజ్ ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయిపోయారు. ప్రస్తుతం అల్లరి పనులు మానేసి బుద్ధిగా కాపురాలు చేసుకుంటున్నారు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మరి ప్రభాస్ కూడా బ్యాచిలర్ షిప్ వదిలేసి ఆ మూడుముళ్ల కార్యక్రమం పూర్తి చేసేదెప్పుడు? అని ఇంటా బైటా చర్చ సాగుతోంది. ఇప్పటికే పెదనాన్న కృష్ణంరాజు పెళ్లి కూతురిని వెతికే పనిలో బిజీగా ఉన్నారు. అలాగే ఇంట్లోవాళ్లు తమకి తోచిన మార్గాల్లో పెళ్లి కూతురిని వెతుకుతూనే ఉన్నారు. అప్పట్లో ఓ ఇండస్ర్టియలిస్ట్ కూతురి సంబంధం సెట్టయ్యేట్టే ఉందని వార్తలొచ్చినా ఎందుకో ఫైనల్ కాలేదు. మరి ఇప్పుడు అప్ డేట్ ఏంటో తెలియరాలేదు.
అయితే ప్రభాస్ బాహుబలి : ది కన్ క్లూజన్ షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ నవంబర్ లో సినిమా మొదలైతే పూర్తయ్యేసరికి రెండేళ్లు పైగానే పడుతుంది. అంటే ప్రభాస్ 2016-17 సీజన్ లో ఫుల్ బిజీ.. అప్పుడు పెళ్లి ఊసెత్తేంత సమయం చిక్కదు. జక్కన్నతో పాటే సెట్స్ లో కుస్తీలు పట్టాల్సిందే. మరి ఈ సీనియర్ బ్యాచిరల్ అంత కాలం వెయిట్ చేయడం ఇబ్బంది కాదంటారా?