Begin typing your search above and press return to search.

రెండో వారం నుంచి ప్ర‌భాస్-మారుతి రీస్టార్ట్!

By:  Tupaki Desk   |   2 Dec 2022 4:29 AM GMT
రెండో వారం నుంచి ప్ర‌భాస్-మారుతి రీస్టార్ట్!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఓ చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. డార్లింగ్ బిజీ షెడ్యూల్ నేప‌థ్యంలో వీలున్న‌ప్పుడే సినిమాకి డేట్లు కేటాయిస్తున్నారు. దీంతో మారుతి గ్యాప్ తీసుకుని తెర‌కెక్కించాల్సి వ‌స్తోంది. తాజాగా రెండ‌వ షెడ్యూల్ ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్నారు.

డిసెంబ‌ర్ రెండవ వారం నుంచి షెడ్యూల్ ప్రారంభం కానుందిట‌. నాటి నుంచి ఏక‌ధాటిగా షెడ్యూల్ పూర్త‌య్యేవ‌ర‌కూ ప్ర‌భాస్ మ‌రో సినిమా షూట్కి హాజ‌రయ్యే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే ప్ర‌భాస్ రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న‌తో పాటు హీరోయిన్ పై లుక్ టెస్ట్ హిస్తున్న‌ట్లు వినికిడి. ఈ షెడ్యూల్ కోసమే హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ పాత‌కాల‌పు సినిమా థియేట‌ర్ సెట్ ని ఏర్పాటు చేస్తున్నారుట‌.

అందులోనే ప్ర‌భాస్ తో పాటు ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌న్ని చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత య‌ధావిధిగా మ‌ళ్లీ ప్ర‌భాస్ 'ప్రాజెక్ట్-కె'..'స‌లార్' షూట్ లో జాయిన్ కానున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆ రెండు సినిమాలు కూడా ఆన్సెట్స్ లో ఉన్న‌సంగ‌తి తెలిసిందే. రెండు భారీ యాక్ష‌న్ చిత్రాలైనా ప్ర‌భాస్ ఏమాత్రం అల‌స‌ట చెంద‌కుడా ప‌నిచేస్తున్నారు.

వాటితో పాటు మారుతి సినిమా కూడా లాంచ్ చేసి సెట్స్ కి తీసుకెళ్ల‌డంతో ప‌ని ప‌ట్ల ఆయ‌న నిబ‌ద్ద‌త ఏంట‌న్న‌ది అద్దం ప‌డుతుంది. టాలీవుడ్ లో చాలా మంది హీరోలున్నారు. కానీ ప్ర‌భాస్ తో వాళ్ల‌కి పోలిక లేద‌ని చెప్పాలి. ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌లేక‌పోతున్నారు. వాళ్ల‌క‌న్నా మెగాస్టార్ చిరంజీవి..న‌ట‌సింహా బాల‌కృష్ణ ఉత్త‌మం.

సీనియ‌ర్ హీరోలు..వ‌యో భారం ఉన్న కుర్ర హీరోల్లా సినిమాలు చేస్తున్నారు. ఈ విష‌యంలో యంగ్ హీరోల‌కే పోటీగా నిలుస్తున్నారు. ప్ర‌భాస్ బ‌ద్ద‌క‌స్తుడ‌ని రాజ‌మౌళి లాంటి వాళ్లు జోక్ చేసినా అది కేవ‌లం కొన్ని విష‌యాల్లోనేన‌ని....చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో మాత్రం చాలా ఉత్సాహంతో పాల్గొంటారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.