Begin typing your search above and press return to search.
రాముడొచ్చేశాడు.. విజువల్ వండర్ గా `ఆదిపురుష్`!
By: Tupaki Desk | 2 Oct 2022 2:13 PM GMTయావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `ఆది పురుష్`. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భహారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్, టీజర్ రానే వచ్చేసింది.
కృతి సనన్ సీత పాత్రలో నపటిస్తుండగా ప్రభాస్ శ్రీరాముడిగా నటించారు. టి. సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై భారతీయ సినీ చిరత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ మూవీని ఐమ్యాక్స్ , 3డీ ఫార్మాట్ లలో రూపొందించారు. విజువల్ ఫీస్ట్ గా అత్యంత సుందరంగా ఈ మూవీని తెకెక్కిస్తుండటంతో యావత్ దేశం మొత్తం ఈ మూవీ గురించే చర్చించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3 ఆదివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రిలీజ్ చేస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటించింది.
అన్నట్టుగానే అక్కడ భారీ ఈవెంట్ ని నిర్వహించి ప్రభాస్ ఫస్ట్ లుక్ ని, టీజన్ ని ఆదివారం రాత్రి విడుదల చేసింది. 1:40 నిమిషాల నిడివిగల టీజర్ సర్వంగా సుందరంగా ఓ విజువల్ ఫీస్ట్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తోంది. శ్రీరాముడి లుక్ లో ప్రభాస్ పర్ ఫెక్ట్ గా ఒదిగిపోయారు. పక్షుల కిలకిల రావాలు.. అందమైన దృశంతో టీజర్ మొదలైంది. సముద్ర గర్భంలో శ్రీరాముడిగా ప్రభాస్ తపస్సు చేస్తున్న విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి.
`భూమి కృంగినా..నింగి చీలినా..న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం...వస్తున్నా..న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్నిఅణిచివేయడానికి ..ఆగమనం.. అధర్మ విధ్వంసం.. అంటూ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో చెబుతున్న డైలాగ్ లు సినిమాపై భారీ అంచనాల్ని రేకెత్తిస్తున్నాయి. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ ని చూపించిన తీరు, సీతని ఉయ్యాలూపుతూ రాముడు కనిపించే దృశ్యాలు... తన వెంట వారథిపై వానర సైన్యం దండుగా కదులుతున్న సన్నివేశాలు.. సముద్రంలో ఆకారం.. ఆకాశానికి ప్రభాస్ విల్లు ఎక్కిపెట్టే సీన్ .. వెరసి ఆదిపురుష్ ఓ విజువల్ వండర్ అని స్పష్టం చేస్తున్నాయి.
ఐమ్యాక్స్ వెర్షన్ తో పాటు ఈ మూవీ 3డీ వెర్షన్ లోనూ రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రతీ సన్నివేశం ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ గా నిలుస్తూ సరికొత్త అనుభూతిని కలిగించడం ఖాయం అని టీజర్ తో తేలిపోయింది. ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీతో యావత్ ఇండియా సరికొత్త అనేభూతికి లోను కావడం ఖాయం.