Begin typing your search above and press return to search.

ప్రభాస్ పై పెట్టుబడులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

By:  Tupaki Desk   |   4 Jun 2022 3:28 AM GMT
ప్రభాస్ పై పెట్టుబడులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకొని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఫలితంగా ఆయన నటించే ప్రతీ సినిమాని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.. వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ‘సాహో’ - ‘రాధేశ్యామ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ డార్లింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అగ్ర దర్శకులు - బడా నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూలు కడుతున్నాయి.

డార్లింగ్ బాక్సాఫీస్ స్టామినాని దృష్టిలో పెట్టుకొని వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారు. మిగతా అగ్ర హీరోల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం 200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతుంటే.. ప్రభాస్ మీద 250 - 500 కోట్లకు పైగా అవలీలగా ఖర్చు చేస్తున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' అనే మైథలాజికల్ డ్రామాలో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇది స్టార్ హీరోకి బాలీవుడ్ డెబ్యూ మూవీ. దీని కోసం రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నట్లు నిర్మాత భూషణ్ కుమార్ స్వయంగా వెల్లడించారు.

అలానే 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నారు ప్రభాస్. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. కన్నడ నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 200 - 250 కోట్ల వరకూ ఖర్చు చేయనున్నారని ప్రచారంలో ఉంది.

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ అనే భారీ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని మేకర్స్ తెలిపారు. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందే సినిమా అవుతుందని పేర్కొన్నారు. దీని కోసం రూ. 550 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇలా ప్రస్తుతం ప్రభాస్ మీద మేకర్స్ 1250 - 1300 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయ్యే సమయానికి ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే 'బాహుబలి 2' సినిమాతో 1800 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టగలిగిన ప్రభాస్ కు.. సరైన సినిమాలు పడితే 1300 కోట్లకు పైగా బిజినెస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

ఒకవేళ సినిమా కొంచం అటు ఇటు అయినా కూడా.. కేవలం నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే నిర్మాతలు తమ పెట్టుబడులను తిరిగి పొందగలుగుతున్నారు. ప్రభాస్ పై వందల కోట్లు ఖర్చు చేయడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు. కానీ మిగతా హీరోలపై అంత ధైర్యంగా వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి మేకర్స్ ముందుకు రాకపోవచ్చు. ఇది ప్రభాస్ స్టార్ పవర్ ను తెలియజేస్తుంది.