Begin typing your search above and press return to search.
ప్రభాస్ మళ్లీ ఆ రిస్క్ చేస్తాడా?
By: Tupaki Desk | 1 July 2017 10:03 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో అతి పెద్ద ఫ్లాపులేవంటే ముందుగా ‘పౌర్ణమి’.. ఆ తర్వాత ‘రెబల్’ గుర్తుకొస్తాయి. ఈ రెండు సినిమాల్ని ఇద్దరు పేరు మోసిన నృత్య దర్శకులు డైరెక్ట్ చేసిన సంగతి మరువరాదు. ముందుగా ప్రభుదేవా ప్రభాస్ కు షాకిస్తే.. ఆ తర్వాత రాఘవ లారెన్స్ ప్రభాస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ప్రభాస్ వీళ్ల మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారు. ‘రెబల్’ తర్వాత ప్రభాస్ కు బాగానే జ్నానోదయం అయి.. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఓవైపు ‘మిర్చి’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్.. మరోవైపు ‘బాహుబలి’తో తిరుగులేని స్థాయిని అందుకున్నాడు. దీని తర్వాత యువ దర్శకుడు సుజీత్ తో ‘సాహో’ను లైన్లో పెట్టాడు.
‘సాహో’ తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణతో సినిమాకు ప్రభాస్ కమిట్మెంట్ ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి. దీన్ని బట్టి యంగ్ రెబల్ స్టార్ ఈ తరం యువతకు కనెక్టయ్యే ట్రెండీ డైరెక్టర్లతో సాగిపోతున్నట్లుగా అనిపించింది. కానీ మధ్యలో ప్రభుదేవా ఎంటరై ‘సాహో’ తర్వాత ప్రభాస్ ను తనే డైరెక్ట్ చేయబోతున్నట్లుగా సంకేతాలిచ్చాడు. మరి ‘పౌర్ణమి’ అనుభవాల్ని.. ప్రభుదేవా ట్రాక్ రికార్డును మరిచిపోయి అతడికి ప్రభాస్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నదే అర్థం కావడం లేదు. దర్శకుడిగా ప్రభుదేవాకు ఒరిజినాలిటీ లేదు. అతను సొంత కథలతో తీసిన సినిమాలు ఆడింది తక్కువ. తమిళ ‘పోకిరి’ అయినా.. హిందీ ‘వాంటెడ్’.. ‘రౌడీ రాథోడ్’ అయినా రీమేకులే. తొలి సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ క్రెడిట్ అతడికి దక్కదు. ప్రభుదేవా తీసిన ఫ్లాపుల సంగతి చెప్పాల్సిన పని లేదు. మరి ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడితో ప్రభాస్ సినిమా చేయడం అవసరమా అని అతడి అభిమానులు కంగారు పడుతున్నారు. మరి ప్రభాస్ మనసులో ఏముందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/