Begin typing your search above and press return to search.
ఫ్లాప్ బుజ్జిగాడు.. అక్కడ హిట్
By: Tupaki Desk | 23 Sep 2015 5:44 AM GMTచెట్టు పేరుతో కాయలు అమ్మేయడం అంటే ఇదే మరి! ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టే ఒక్క బాహుబలి ప్రభాస్ జీవితాన్ని మార్చేసింది. అతడి రేంజ్‌ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు అతడు యూనివర్శల్ స్టార్, గ్లోబల్ స్టార్. స్టారాధి స్టార్. కేవలం తెలుగు మార్కెట్లోనే కాదు అటు తమిళ్ - మలయాళం - కన్నడం - హిందీ మార్కెట్లోనూ ప్రభాస్ పేరు మార్మోగిపోతోంది. ఫలితం ప్రభాస్ నటించిన పాత సినిమాలన్నిటినీ స్టోర్‌లోంచి బైటికి తెచ్చి వాటిని తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.
ముఖ్యంగా మల్లూవుడ్‌లో బాహుబలి సాధించిన అసాధారణ రికార్డులతో ప్రభాస్ క్రేజు మెస్మరైజింగ్‌గా పెరిగింది. ప్రభాస్ నటించిన మాస్ ఎంటర్‌టైనర్ బుజ్జిగాడు ఇక్కడ ఫ్లాప్, అక్కడ హిట్. ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బుజ్జిగాడు తెలుగులో ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాని ఇటీవలే మలయాళంలో రుద్రన్ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ బుజ్జిగాడు (రుద్రన్) పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా మలయాళ రిలీజ్ హక్కుల్ని కేవలం 9లక్షలకు దక్కించుకున్న మలయాళ నిర్మాతలు.. అక్కడ అనువదించి రిలీజ్ చేసి హిట్ కొట్టారు. అక్కడ ఆరంభమే 15 లక్షల షేర్ వసూలైంది. బాహుబలి ప్రభాస్ నటించిన అంటూ ప్రచారం చేసి బుజ్జిగాడిని హిట్ చేశారక్కడ.
ఇదే ఇన్‌స్పిరేషన్‌తో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మిర్చి కూడా అనువాదమై ఈనెల 24 న రిలీజవుతోంది. బాహుబలి ప్రభాస్ - దేవసేన అనుష్క జంటగా నటించిన .. అన్న ట్యాగ్ లైన్‌తో మిర్చి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. చూస్తుంటే ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బాహుబలి క్రేజుతో అసాధారణ బిజినెస్ చేయడం ఖాయం అనే అనిపిస్తోంది. ఇకముందు ప్రభాస్ నటించే ఏ సినిమాకి అయినా మలయాళంలో గిరాకీ ఉంటుందనడం లో సందేహమే లేదు. బాపురే .. చెట్టు కాయలు అమ్మేయడం అంత వీజీనా?