Begin typing your search above and press return to search.

ప్రభాస్ మీద ఆశలు వదిలేసుకుంటే బెటర్

By:  Tupaki Desk   |   17 Jan 2023 2:30 PM GMT
ప్రభాస్ మీద ఆశలు వదిలేసుకుంటే బెటర్
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. మరో వైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ కూడా సెట్స్ పైన ఉంది. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

భారీ ఇలా భారీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ చేతిలో ఉన్నాయి. రెండు సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉండగానే మారుతి దర్శకత్వంలో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఒక మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఈ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక సెట్స్ పైనే ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్ట్స్ వేల్యూ సుమారు వెయ్యి కోట్ల వరకు ఉంటుంది.

ఇవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. వీటి తర్వాత కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. ఈ ఏడాది ఆఖరులో ఈ మూవీ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.దీని తర్వాత బాలీవుడ్ స్టార్ దర్శకుడు పఠాన్ ఫేమ్ సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రాజెక్ట్ కె మూవీ రేంజ్ బట్టి ఈ సినిమా పాన్ వరల్డ్ లెవల్ లో ఉంటుందా లేదంటే పాన్ ఇండియా లెవల్ లోనే ఉంటుందా అనేది తెలుస్తుంది. దీని తర్వాత మరల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే దిల్ రాజు ప్రొడక్షన్ లో రవణం అనే మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా దిల్ రాజు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.

మొత్తానికి చేతిలో ఏకంగా అరడజను ప్రాజెక్ట్స్ పెట్టుకొని ప్రభాస్ ఓ ఐదేళ్ళ వరకు ఫుల్ బిజీ షెడ్యుల్ తో ఉన్నాడని చెప్పాలి. చాలా మంది దర్శకులకి ప్రభాస్ తో మూవీ చేయాలని ఉన్నా కూడా ప్రస్తుతం రెబల్ స్టార్ లైన్ అప్ చూసిన తర్వాత కచ్చితంగా వెనక్కి తగ్గాల్సిందే లేదంటే కనీసం నాలుగేళ్ళు ఎదురుచూదాల్సిందే.

చేతిలో ఈ ఇన్ని ప్రాజెక్ట్స్ ఉండగా రాజమౌళి కొద్ది రోజుల క్రితం బాహుబలి సీక్వెల్ ఉందా ఉంటుందని చెప్పాడు. అది కూడా సెట్ అయితే మరో పదేళ్ళ వరకు ప్రభాస్ గురించి ఇతర దర్శకులు మరిచిపోయి వేరే హీరోలని ట్రై చేసుకోవడం బెటర్ అనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.