Begin typing your search above and press return to search.
రెబల్ జీవితంలో 250 రోజులు ఆ ప్రయోగానికే అంకితం!
By: Tupaki Desk | 27 July 2021 7:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ 90 ఏళ్ల సుదీర్ఘ ఇన్నింగ్స్ లో ఇలాంటి ప్లానింగ్ వేరొక హీరో ఎవరికీ సాధ్యపడలేదంటే అతిశయోక్తి కాదు. అతడు ఒక వేవ్ లా దూసుకెళుతూ అటు హిందీ హీరోలకే చెమటలు పట్టించేస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ గా అసాధారణ స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నాడు. ప్రభాస్ నటిస్తే తెలుగు-తమిళం -హిందీలోనే కాదు అటు జపాన్ - తైవాన్ - చైనాలోనూ ఇప్పుడు మార్కెట్ ఉంది. `బాహుబలి` తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ లో ఇటీవల ఎంతో మార్పు కనిపిస్తోంది. ఎంపిక చేసుకునే కథలు యూనివర్శల్ గా నిలబడేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సాహో లాంటి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించడం వెనక వ్యూహం కూడా అదే. సాహో విషయంలో కొన్ని తప్పిదాలనుంచి కూడా తెలివిగా నేర్చుకుని భవిష్యత్ లో మళ్లీ అలాంటివి రిపీటవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.
స్క్రిప్టు దర్శకుల ఎంపిక విషయంలో ప్రభాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ లో ఎందరో దర్శకులు ఆయనతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. బాలీవుడ్ మార్కెట్ ని ట్రాప్ లో వేసేందుకు ప్రభాస్ చేస్తున్న ప్రయత్నాలు ఇటీవల చర్చకు వస్తున్నాయి. సెంటిమెంటుకి లొంగక సన్నిహితులతో డిస్టెన్స్ ని మెయింటెన్ చేస్తూ కంటెంట్ పరంగా స్క్రిప్ట్ లో మ్యాటర్ ఉండేలా దర్శకుడి ట్రాక్ రికార్డ్ ను పరిశీలించి నిర్ణయించుకునేలా ప్రతిదీ ప్లాన్ చేస్తున్నారు.
వైవిధ్యం కోసం `సలార్`.. `ఆదిపురుష్ 3డి` లాంటి క్రేజీ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకున్న ప్రభాస్ తదుపరి సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించడం వ్యూహాత్మకం. నాగ్ అశ్విన్ లాంటి ట్యాలెంటెడ్ దర్శకుడితో భారీ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ చేయడానికి అంగీకరించారు. ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే చాలా సర్ ప్రైజ్ లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డార్లింగ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` పూర్తి ప్రేమకథా చిత్రం. ఇది ఓ పీరియడ్ లవ్ స్టోరీ. యూరప్ నేపథ్యంలో సాగే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ రక్తి కట్టిస్తుంది. కాన్సెప్ట్ పరంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రీకరణ ప్రస్తుతం ముగింపులో ఉంది. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
హిందీ మార్కెట్ పై పూర్తి ఫోకస్:
`రాధేశ్యామ్` ఆల్మోస్ట్ ప్రభాస్ కి బాలీవుడ్ ఎంట్రీ మూవీగా పరిగణించాలి. హిందీ వెర్షన్ ని రాధాకృష్ణ కుమార్ అదే తీరుగా ఆవిష్కరిస్తున్నారని సమాచారం. అలాగే ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తోన్న మరో చిత్రం `ఆదిపురుష్` అక్కడ స్ట్రెయిట్ మూవీ లాంటిది. ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రమిది. ఇతిహాసం రామాయణం అధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక `కేజీఎఫ్` దర్శకుడు ప్రశాంత్ నీల్ తో `సలార్`లోనూ ప్రభాస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా సెట్స్ లో ఉంది. మరోవైపు`మహానటి` దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ స్పై థ్రిల్లర్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందనుంది. బాలీవుడ్ లోనూ ఈ సినిమా బిగ్ మార్కెట్ ని ఛేజిక్కించుకునే దిశగా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఒక్క సినిమా కోసమే ప్రభాస్ 250 రోజుల కాల్షీట్లు కేటాయించారంటే ఇది ఎంతటి ప్రతిష్ఠాత్మక చిత్రమో అర్థం చేసుకోవాలి. సుమారు రెండేళ్ల పాటు ఈ సినిమా తెరకెక్కే వీలుందని అర్థమవుతోంది. ఇలా ప్రభాస్ వరుసగా వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్లతోనే పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ సినిమాలు చేస్తుండడం చూస్తుంటే ఇప్పట్లో అతడి టార్గెట్ ఖాన్ ల రేంజు అని అర్థమవుతోంది.