Begin typing your search above and press return to search.
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' క్లాప్ పడింది
By: Tupaki Desk | 24 July 2021 10:30 AM GMTప్రభాస్ హీరోగా దీపిక పదుకునే హీరోయిన్ గా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ నేడు ప్రారంభం అయ్యింది. అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. ముందస్తు సమాచారం ఏమీ లేకుండా ఈ రోజున షూటింగ్ ను ప్రారంభించారు. షూటింగ్ ప్రారంభించిన తర్వాత కాని అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభంకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చాడు. గురు పూజోత్సవం సందర్బంగా ఇండియన్ సినిమాకు గురువు వంటి అమితాబచ్చన్ గౌరవార్థం ఈ సినిమాను ప్రారంభించారు.
ఈ సినిమా క్లాప్ బోర్డ్ పై ప్రాజెక్ట్ కే అంటూ ఉండటంతో టైటిల్ అదేనా అంటూ ఇప్పుడు చర్చ మొదలు అయ్యింది. ఇండస్ట్రీ మొత్తం అదే టైటిల్ గా కన్ఫర్మ్ అయ్యారు. ఇక కొందరు ప్రాజెక్ట్ కే గురించి చర్చించడం మొదలు పెట్టారు. ప్రాజెక్ట్ కే లో భాగంగా టైమ్ ట్రావెల్ చేయబోతున్నారని.. 2050 సంవత్సరంలోకి తీసుకు వెళ్లి అద్బుతాలను మన కళ్ల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్ట్ కే తో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా మారడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా అంటున్నారు.
నేటి నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుతున్నారు. ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్ లో ఈ సినిమా షూటింగ్ ను జరుపుతున్నట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కోసం వైజయంతీ మూవీస్ వారు ఏకంగా 400 నుండి 500 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించిన నాగ్ అశ్విన్ హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గకుండా విజువల్ వండర్ గా సినిమాను రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ను 203 వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.