Begin typing your search above and press return to search.
ప్రభాస్ కొత్త లుక్ కు అంతా సాహో
By: Tupaki Desk | 3 Sep 2017 4:42 AM GMTబాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్ల పాటు అన్నీ వదిలేసి ఓ తపస్సులా ఆ సినిమా కంప్లీట్ చేశాడు. అతడి కష్టం వృథా పోలేదు. బాహుబలి సినిమా ప్రభాస్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశమంతటా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించి పెట్టింది. ఈసారి యాక్షన్ బేస్ డ్ ఎంటర్ టెయినర్ తో అభిమానులను మరింత మురిపించడానికి ప్రభాస్ సాహో తో సిద్ధమవుతున్నాడు.
రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో షూటింగ్ ఇప్పటికే చకచకా సాగుతోంది. బాహుబలికి పూర్తి భిన్నంగా ఎట్రాక్టివ్ గా కనిపించేలా ప్రభాస్ లుక్ మొత్తం మార్చాడు. నిన్నటివరకు మాహిష్మతి యువరాజుగా.. వీరాధి వీరుడిగా రాజసం నిండిన దుస్తుల్లో కనిపించిన యంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు సాహో కోసం రెడీ అయిన తీరు చూసి అంతా స్టన్ అయిపోతున్నారు. సాహో సినిమాలో కనిపించే కొత్త లుక్ తో ప్రభాస్ తన ఫేస్ బుక్ కవర్ పేజీ కూడా మార్చాడు. ఇంతకుముందు బాహుబలి-2 రిలీజ్ రోజున డైరెక్టర్ రాజమౌళి తో నవ్వుతూ ఉన్న స్టిల్ ను పెట్టిన ప్రభాస్ మళ్లీ ఇన్నాళ్లకు కవర్ పేజీ మార్చాడు. కొత్త హెయిర్ స్టయిల్ తో మాన్లీలుక్ తో ఉన్న కొత్త స్టిల్ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే అభిమానుల నుంచి తెగ పొగడ్తలు వచ్చేశాయి. కాలేజ్ బోయ్ లుక్ క్షణాల్లో వైరల్ అయిపోయింది.
సాహోపై తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ కూడా చాలా ఇంట్రస్ట్ తో ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు పెరిగిన ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా ఒకేసారి హిందీలోనూ తీస్తున్నారు. దీనికితోడు హీరోయిన్ శ్రద్ధ కపూర్ నుంచి మెయిన్ విలన్ నీల్ నితిన్ ముఖేష్ తో పాటు మిగతా క్యారెక్టర్లలోనూ బాలీవుడ్ నటులు కనిపించనున్నారు. అందుకు తగ్గట్టే అందరినీ మెప్పించేలానే ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. సో.. లెట్స్ బిగిన్ ద షో.