Begin typing your search above and press return to search.

మ‌రీ ఇంత సాఫ్ట్ అయితే ఎలా డార్లింగ్?

By:  Tupaki Desk   |   7 Feb 2020 3:30 AM GMT
మ‌రీ ఇంత సాఫ్ట్ అయితే ఎలా డార్లింగ్?
X
బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా హ‌వా సాగిస్తున్నాడు ప్ర‌భాస్. అయితే `సాహో` ప్ర‌భాస్ దూకుడుకు చిన్న‌పాటి బ్రేక్ వేసింది. పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజై హిందీ బాక్సాఫీస్ ని కుమ్మేసినా.. సౌత్ లో ఆశించినంత హిట్ట‌వ్వ‌క‌పోవ‌డం సాహో స్టార్ కి మైన‌స్ అయ్యింది. భారీ అంచ‌నాల న‌డుమ రిలీజై ఆ రేంజును అందుకోలేక‌పోవడంతో ప్ర‌భాస్ ఎంతో ఆచితూచి త‌దుప‌రి చిత్రంపై క‌స‌ర‌త్తు చేశారు.

కొంత షూటింగ్ అయ్యాక కూడా దానిని కాద‌నుకుని తిరిగి ఫ్రెష్ గా రీఫ్రెషింగ్ స్టోరీని రెడీ చేయించుకుని జిల్ రాధాకృష్ణ తో `జాన్`ని ప‌ట్టాలెక్కించారు. ఈ సినిమా టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఇదో ప్రేమ‌క‌థా చిత్రం. ఒక పేద‌రాలిని ప్రేమించే ధ‌నికుడి క‌థ ఇది. వింటేజ్ కార్స్ యుగంలో క‌థ న‌డుస్తుంది. ఒక మ‌ల్టీ మిలియ‌నీర్ వ్యాపారిగా ప్ర‌భాస్ న‌టిస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. అలాంటి కాస్ట్ లీ యువ‌కుడు పేద యువ‌తి పూజా తో ల‌వ్ అంటే ఎలా ఉంటుందో ఊహించేదే. విలాస‌వంత‌మైన జీవితం గ‌డిపే కుర్రాడు అంటే సాఫ్ట్ నేచుర్ తోనే ఉండే అవ‌కాశం ఉంటుంది. అలాగే సాఫ్ట్ లుక్ కూడా మెయింటెయిన్ చేయాలి.

ఇంత‌కుముందు రిలీజైన ప్రీలుక్ చూడ‌గానే డార్లింగ్ మ‌రీ ఇంత సాఫ్టా? అన్న కామెంట్ ఒక సెక్ష‌న్ లో వినిపించింది. ఆ పోస్ట‌ర్ లో ప్రేమికుడిలోని ఆత్రంతో పాటు సాఫ్ట్ నెస్ కూడా క‌నిపించింది. ప్ర‌స్తుతం జాన్ షెడ్యూల్స్ ని వ‌డివ‌డిగా తెర‌కెక్కిస్తున్నార‌ట‌. అయితే ఆన్ లొకేష‌న్ నుంచి లీకైన స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో ప్ర‌భాస్ రోల్ ఎంతో సాఫ్ట్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఒక సాఫ్ట్ నేచుర్ ఉన్న కుర్రాడి ప్రేమ‌క‌థ ఇది. అయితే బాహుబ‌లి - సాహో లాంటి భారీ మాస్ యాక్ష‌న్ సినిమాల్లో న‌టించిన ప్ర‌భాస్ .. ఇప్పుడు సాఫ్ట్ గా క‌నిపిస్తే ఎలా? ల‌వ్ స్టోరి చేసిన కానీ మ‌రీ ఇంత సాఫ్ట్ గా వ‌స్తే క‌ష్టమే డార్లింగ్ అన్న కామెంట్ వినిపిస్తోంది. మ‌రి సాఫ్ట్ గా క‌నిపిస్తూనే ఉన్న‌ట్టుండి స‌డెన్ గా మాస్ యాంగిల్ ఏదైనా తీస్తాడా? అన్నది కూడా చూడాలి. ఇక ఈ రూమ‌ర్ నిజం అయితే క‌నుక ప్ర‌భాస్ ఫ్యాన్స్ త‌ట్టుకోగ‌ల‌రా? అన్న‌ది చూడాలి.