Begin typing your search above and press return to search.
సాహో మీదే దాని భవిష్యత్తు
By: Tupaki Desk | 2 Jun 2019 7:05 AM GMTడార్లింగ్ ఫ్యాన్స్ ఈ రెండున్నర నెలలు ఎప్పుడెప్పుడు గడిచిపోతాయా అని ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న సాహో విడుదలలో ఎలాంటి మార్పు ఉండబోదని నిర్మాతలు పదే పదే హామీ ఇవ్వడంతో అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. శంకర్ ఎహసాన్ లాయ్ లు తప్పుకున్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు యువి టీమ్ ప్రీ ప్లానింగ్ లో ఉందని సమాచారం. కానీ ఆ పేరు బయటికి రాకుండా సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారు.
దీని సంగతి అలా ఉంచితే సాహోతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా సంక్రాంతికే వస్తుందని లీకులు మొదలైపోయాయి. దీనికి జాన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఇంకో టాక్ ఆసక్తికరంగా మారింది. సాహో ఫలితం పూర్తిగా వచ్చాక అప్పుడే దీని విడుదల విషయంలో నిర్ణయం తీసుకుంటారట. సాహో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఆ సమయానికి జనవరికి కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ గ్యాప్ లో ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్ చేస్తే ఆ తర్వాత మరో రిలీజ్ కు చాలా ఎక్కువ సమయం పట్టొచ్చు.
ఎందుకంటే ఈ రెండు కాకుండా ప్రభాస్ ఇంకే సినిమా కమిట్ కాలేదు. ఓ రెండు చర్చల దశలోనే ఉన్నాయి. అందుకే అలా కాకుండా సాహో రిజల్ట్ తో సంబంధం లేకుండా రాధాకృష్ణ మూవీని 2020 సమ్మర్ కి షెడ్యూల్ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ఆలోచన చేస్తున్నారట. షూటింగ్ కూడా డిసెంబర్ లోపు పూర్తయ్యే ఛాన్స్ తక్కువగా ఉంది కాబట్టి సంక్రాంతి రేస్ గురించి డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్కువ ఆలోచించకపోవడమే బెటర్ ఏమో