Begin typing your search above and press return to search.

ఇంతకీ సాహో బడ్జెట్ ఎంత?

By:  Tupaki Desk   |   1 Sept 2019 12:24 PM IST
ఇంతకీ సాహో బడ్జెట్ ఎంత?
X
రెండేళ్ల నుంచి ఎదురు చూసిన సాహో రానే వచ్చింది. భయపడినంతా జరిగింది. ఫ్యాన్స్ ఎంత పాజిటివ్ గా చెబుతున్నా ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ రాలేదు కాబట్టి ప్రోత్సహించాలని మూవీ లవర్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నా జెనరల్ పబ్లిక్ మాత్రం అధిక శాతం పెదవి విరుస్తున్న మాట వాస్తవం. పండగ కలిసివచ్చిన లాంగ్ వీకెండ్ కాబట్టి మంచి వసూళ్లతో బయ్యర్లు కాస్త రిలాక్స్ గా ఉన్నారు కానీ లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది.

దీనికి ఇంత హైప్ వచ్చేందుకు గల కారణాల్లో ఒకటి ప్రభాస్ ఇమేజ్ అయితే రెండోది 350 కోట్లు ఖర్చు పెట్టామని నిర్మాతలు పదే పదే చేసుకున్న పబ్లిసిటీ స్టంట్. సాధారణంగా ప్రొడక్షన్ మీద కామన్ మ్యాన్ కు లోతైన పరిజ్ఞానం లేకపోయినా కళ్ళముందు కనిపిస్తున్న ఖర్చు గురించి కనీస అవగాహన ఉంటుంది. ఆ లెక్కన సాహోకు 350 కోట్లు అయ్యిందంటే నమ్మశక్యం కాకపోవడం సహజమే. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ ఛేజ్ పాటల చిత్రీకరణ తన మరీ ఓవర్ ది ఎక్స్ పెక్టేషన్ ఖర్చు ముమ్మాటికీ కాలేదనే ఎవరికైనా అనిపిస్తుంది.

అలాంటప్పుడు మార్కెటింగ్ కోసమే యువి సంస్థ బడ్జెట్ ఎక్కువ చెప్పుకున్నారా అనే అనుమానాలు రావడం సహజం. బాహుబలి తరహాలో మైండ్ బ్లోయింగ్ అనే విజువల్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవు. పైపెచ్చు ఒకటి రెండు చోట్ల వాటి లోపాలు కూడా స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో సాహో బడ్జెట్ గురించి వస్తున్న సందేహాలకు చెక్ పడాలి అంటే నిర్మాతలే చెప్పాలి. అది జరగని పని కాబట్టి ఎవరి కంక్లూజన్ కు వాళ్ళు రావాల్సిందే.