Begin typing your search above and press return to search.

తిరిగొచ్చిన ప్రభాస్.. ప్రమోషన్స్ కోసమేనా?

By:  Tupaki Desk   |   1 Sep 2019 5:46 PM GMT
తిరిగొచ్చిన ప్రభాస్.. ప్రమోషన్స్ కోసమేనా?
X
డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూసిన చిత్రం 'సాహో' అనేది అందరూ ఒప్పుకునే విషయమే కానీ సినిమాకు మాత్రం నెగెటివ్ టాక్ వచ్చింది. ఒకవైపు ఓపెనింగ్ కలెక్షన్స్ నాన్ బాహుబలి లిస్టులో ప్రథమ స్థానాన్ని ఆక్రమించినా.. హిందీ వెర్షన్ బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు దీటుగా కలెక్షన్స్ వసూలు చేస్తున్నా.. సోమవారం నుండి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన మాత్రం బయ్యర్లలో డిస్ట్రిబ్యూటర్లలో వ్యక్తం అవుతూనే ఉంది. ఎందుకంటే బ్రేకీవెన్ చేరాలంటే ఈ సినిమా కనీసం రెండువారాలు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా ఉండాలి.

మరి ఈ సినిమాకు సోమవారం కలెక్షన్స్ డ్రాప్ అయ్యే పరిస్థితే వస్తే ఎలా? ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ ఇప్పటివరకూ స్వయంగా ప్రభాస్ ఒంటిచేత్తో చక్కబెట్టాడు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ప్రమోషన్స్ మొదలు పెట్టాలన్నా ప్రభాస్ ఉండడం తప్పనిసరి. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఇండియాకు తిరిగి వచ్చాడట. సినిమా రిలీజ్ కు ముందుకు ప్రమోషన్స్ పూర్తి చేసుకున్న ప్రభాస్ రిలాక్స్ అవడం కోసం విదేశాలకు వెళ్ళాడట. అయితే సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి తన ట్రిప్ ను అర్థాంతరంగా ముగించుకుని సడెన్ గా హైదరాబాద్ కు తిరిగి వచ్చాడని సమాచారం. ఈరోజు తెల్లవారు ఝామున 3.30 గంటలకు ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ ఇండియాకు తిరిగిరావడం అక్కడ ఉన్న కొందరు ప్రయాణీకులు చూడడం జరిగింది. ప్రభాస్ ను రిసీవ్ చేసుకునేందుకు ఎవరూ లేరని అక్కడ ఉన్న ప్రయాణీకులు చెప్తున్నారు. దీన్ని బట్టి ప్రభాస్ ముందుగా ప్లాన్ చేసుకున్న జర్నీ కాదని.. సడెన్ గా.. సీక్రెట్ గా రావడంతోనే ఇలా జరిగి ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

'సాహో' కు నెగెటివ్ టాక్ వచ్చింది కాబట్టి ప్రభాస్ ఏమైనా అప్సెట్ అయ్యాడా? సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది కాబట్టి రికవరీ చేయాలంటే తన ప్రమోషన్స్ అవసరం ఉంటుందని ఇండియాకు తిరిగి వచ్చాడేమో అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆ వెర్షన్ నిజమే అయితే సోమవారం ప్రభాస్ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం..ఏం జరుగుతుందో!