Begin typing your search above and press return to search.

బాహుబలి 2.. ప్రభాస్ కు నచ్చుతుందా?

By:  Tupaki Desk   |   15 Jun 2016 11:36 AM GMT
బాహుబలి 2.. ప్రభాస్ కు నచ్చుతుందా?
X
రాజమౌళి ఇంటర్వెల్‌ బ్యాంగులు తీయడంలో స్పెషలిస్టు కాబట్టి.. బాహుబలిః ది కంక్లూజన్ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఎలా ఉంది అని ప్రశ్నించాడు ఒక ఇంటర్యూయర్‌. ''అబ్బే నాకు స్టూడెంట్‌ నెం.1 ఇంటర్వెల్‌ చాలా బాగుంది. బాహుబలి అంత కిక్కు రాలేదు'' అంటూ షాకిచ్చాడు ప్రభాస్‌. నిజానికి బాహుబలి బ్యాంగ్‌ లో కేవలం అందరూ బా..హు..బ..లి అంటూ అరవడం ఒక్కటే ఉంటుంది కాని.. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అయినాసరే ప్రభాస్ కు మాత్రం నచ్చలేదట.

ఇప్పుడు క్లయమ్యాక్స్ ను చాలా కష్టపడి తీస్తున్నా అంటున్నాడు రాజమౌళి. హాలీవుడ్ టెక్నీషియన్ల దగ్గర నుండి ప్రీ-విజువలైజేషన్‌ వరకు అన్నీ పక్కాగా ఉన్నాయంటున్నారు. రోజూ హైప్ తో చితక్కొట్టేస్తున్నారు. అలాంటప్పుడు మరి ఈసారి రాబోయే ఇంటర్వెల్‌ బ్యాంగ్ దాదాపు ప్రీ-క్లయమ్యాక్స్ వంటిది. ఈసారైనా రాజమౌళి తీసింది ప్రభాస్‌ కు నచ్చుతుంది అంటారా? లేకపోతే మరోసారి మనోడు అప్సెట్‌ అవుతాడా? పైగా మొదటి భాగం 600 కోట్లు వసూలు చేసిన తరువాత.. ఇప్పుడు ప్రభాస్‌ ఇంటర్వెల్‌ బ్యాంగ్ నచ్చలేదంటే కష్టమే సుమి.

ఏదేమైనా ప్రస్తుతం 200 మంది ఫైటర్లతో కలసి ప్రభాస్ ఫిలిం సిటీలో బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.