Begin typing your search above and press return to search.
ప్రభాస్ పరువుపోతోంది అనవసరంగా
By: Tupaki Desk | 27 Oct 2015 5:30 PM GMTఆల్రెడీ పోకస్ అంతా ప్రభాస్ మీదనే ఉందని.. బాలీవుడ్ మీడియా ఆ అంటే ప్రభాస్.. ఊ అంటే ప్రభాస్.. అన్న చందంగా మనోడి గురించి ఎన్నో రూమర్లను పుట్టిస్తున్నారని మనం చెప్పుకున్నాం. ఫ్రమ్ బాహుబలి టు ప్రభాస్ మ్యారేజ్.. మాట్లాడితే మన భీమవరం బుల్లోడి గురించి తెగ రాతలు రాసేస్తున్నారు. అయితే దీని వెనుక ఏదైనా రీజన్ ఉందా అని కాస్త డీప్ గా వెతికితే.. ఇప్పుడు పెద్ద రచ్చే జరుగుతోందని తెలుస్తోంది.
నిజానికి బాలీవుడ్ లో యాడ్లు రావాలన్నా.. ఏవైనా ఎండార్సమెంట్లు సెట్టవ్వాలన్నా.. అక్కడి లోకల్ పి.ఆర్. కంపెనీలు అవన్నీ మనకు చేసిపెట్టేస్తాయి. మధుర్ బండార్కర్ అనే దర్శకుడు ''హీరోయిన్'' సినిమాలో అదే విషయాన్ని చూపించాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ యాడ్ల విషయాలను కూడా అలాంటి ఒక పి.ఆర్. సంస్థ హ్యాండిల్ చేస్తోందట. అందుకే బాహుబలి సక్సెస్ తరువాత తెలుగు పత్రికలకు ఒక్క ఇంటర్యూ కూడా ఇవ్వని మన కండలవీరుడు అక్కడ 'మిర్రర్' పత్రికకు మాత్రం ఎక్సక్లూజివ్ ఇంటర్యూ ఇచ్చాడు. యాడ్లు రావాలంటే నిరంతరం న్యూస్ లో ఉండాల్సిందేనంటూ.. మనోడితో వరుసగా ఏదో ఒక ఇంటర్యూలు ఇప్పిస్తూ.. వాటి నుండి సంచలనాత్మకమైన స్టేట్ మెంట్లను పట్టుకొని పెద్ద పెద్ద స్టోరీలే అల్లిస్తున్నారు.
రీసెంటుగా.. ఒక 22 ఏళ్ల పిల్లతో ప్రభాస్ ఎంగేజ్ మెంట్ అయ్యేలా ఉందంటూ వచ్చిన స్టోరీ కూడా ఈ బాపతేనట. అంతేకాదు.. ధూమ్ 4 సినిమాలో ప్రభాస్ హీరో అంటూ వచ్చిన న్యూస్ కూడా ఇదే రకం అని చెబుతున్నారు. కట్ చేస్తే.. ఇలాంటి న్యూస్ ల వలన ఇక్కడ టాలీవుడ్ లో ప్రభాస్ పరువు పోతోంది మరి. ఏజన్సీది ఏం పోయింది.. కాంట్రాక్టు ఇచ్చినంత కాలం ఇలాగే రాయిస్తారు.. కాని మావాడి ఇమేజ్ డ్యామేజ్ అవ్వట్లేదు ఇక్కడ? ఏమంటావ్ ప్రభా?