Begin typing your search above and press return to search.

థియేట‌ర్లో ప్ర‌భాస్ ఓటీటీ షో..థింక్ ఇట్ ఒన్స్!

By:  Tupaki Desk   |   17 Dec 2022 11:00 AM GMT
థియేట‌ర్లో ప్ర‌భాస్ ఓటీటీ షో..థింక్ ఇట్ ఒన్స్!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఎంట్రీతో అన్ స్టాప‌బుల్ సీజ‌న్-2 అలా ఒక్క‌సారిగా మ‌ళ్లీ పైకి లేచింది. ప్ర‌భాస్ ముందు బాల‌య్య కుర్చున్నా! డార్లింగ్ వ‌చ్చేస‌రికి స‌న్నివేశం ఒక్క‌సారిగా వెడెక్కింది. బాల‌య్య సూటి ప్ర‌శ్న‌ల‌కు ఈ సిగ్గ‌రి ఎలాంటి స‌మాధానాలు చెప్పాడో? ఏంటో? అంటూ అభిమానులు ఓవైపు కంగారు ప‌డుతున్నారు. ప్ర‌భాస్ గ్లింప్స్...గోపీచంద్ ప్రోమో రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి.

ఈ ద్వ‌యాన్ని బాల‌య్య ఎంత ఆస‌క్తిక‌రంగా చూపించ‌బోతున్నారో? అంటూ ఇద్ద‌రి హీరోల అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఒక‌టే ఎగ్జైట్ మెంట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఓ అభిమాని ఇంట్రెస్టింగ్ ఐడియా ఒక‌టి షేర్చేసాడు. ఇది ఓటీటీలో క‌న్నా..థియేట‌ర్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందేమో..థింక్ ఇట్ ఒన్స్ అంటున్నాడు.

థియేట‌ర్ లో ప్రీమియ‌ర్ ఆ రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. క‌లెక్ష‌న్లు వేరుగా ఉంటాయి? ట్రై చేయండి అన్నాడు. దీనికి నిర్వాహ‌కులు ఈ ఐడియో ఏదో బాగుందే? ఏమంటారు వేద్దామా? అంటూ ఓ ట్వీట్ వేసారు. దీంతో సోష‌ల్ మీడియాలో రెస్పాన్స్ అదిరిపోయింది. నేరుగా థియేట‌ర్ లోనే వేయండి అంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

మ‌రి నిర్వాహ‌కులు తుదిగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. ఇక డార్లింగ్ టీవీ ఇట‌ర్వ్యూలు ఇచ్చింది చాలా రేర్. కెరీర్ ఆరంభంలో కొన్ని ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. అటుపై పాన్ ఇండియా స్టార్అయిన త‌ర్వాత చాలా రేర్ గానే క‌నిపించారు. మ‌ళ్లీ ఇంత కాలానికి బుల్లి తెర‌పై క‌నిపించ‌డం విశేషం.

ఇటీవ‌లి కాలంలో రీ-రిలీజ్ లు టాలీవుడ్ లో ట్రెండ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో డార్లింగ్ సినిమాలు కూడా రీ-రిలీజ్ అవుతున్నాయి. వాటికి థియేట‌ర్లో రెస్పాన్స్ బాగుంటుంది. దీంతో అన్ స్టాప‌బుల్ షో కూడా థియేట‌ర్ రిలీజ్ చేస్తే కొత్త అనుభూతిని పంచిన‌ట్లు అవుతుంది. మ‌రి దీనికి డార్లింగ్ ఏమంటాడో కూడా ఆలోచించాలి సుమీ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.