Begin typing your search above and press return to search.

ప్రభాస్ పోలీస్ గెటప్ వేస్తే..

By:  Tupaki Desk   |   1 Jan 2016 11:37 AM GMT
ప్రభాస్ పోలీస్ గెటప్ వేస్తే..
X
ఆరడుగులు పైన ఉంటే ఈ అందగాడికి.. ఖాకీ డ్రస్ వేయాలనే ఆలోచనే సూపర్ కదూ. ఇప్పటివరకూ ఎవరూ రెబెల్ స్టార్ కోసం ఇలాంటి కేరక్టర్ సెట్ చేయలేదు. కానీ ఇప్పుడు సుజిత్ ఈ పని చేయబోతున్నాడు. బాహుబలి లాంటి మహారాజు కేరక్టర్ కి సరిపడేలా ఉన్న ప్రభాస్ ని.. పోలీస్ గెటప్ వేయిస్తున్నాడు.

ప్రభాస్ తో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషింప చేసేందుకు స్టోరీ ఫైనల్ దశకు చేరుకుంది. ప్రస్తుతం బాహుబలి సీక్వెల్ చేస్తూ.. బిజీగా ఉన్నాడు యంగ్ రెబెల్ స్టార్. రీసెంట్ గానే బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. మరో ఆరు నెలలకు పైగా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. దాదాపు ఈ సినిమా రిలీజ్ వరకూ.. బాహుబలి కోసమే కష్టపడాల్సి ఉంటుంది. కాకపోతే.. ఇది గ్రాఫిక్ ఓరియెంటెడ్ కాబట్టి.. ముందు ఓ మూడు నెలలు ఫ్రీ అవచ్చనే అంచనాలున్నాయి. ఈ సమయానికి ప్రభాస్ ఫ్రీ అవుతాడు. అఫ్పుడు తన నెక్ట్స్ వెంచర్ ని స్టార్ట్ చేసేందుకు అవకాశాలున్నాయి. ఈ లోపుగానే అన్ని పనులు పూర్తి చేసేసుకునేందుకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ సిద్ధమవుతున్నాయి.

యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించనుండడం విశేషం. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. తన కెరీర్ లోనే తొలిసారిగా ప్రభాస్ పోలీస్ గెటప్ వేయనుండడం విశేషం.