Begin typing your search above and press return to search.
బాహుబలి పెళ్లిని వాయిదా వేసేశాడు
By: Tupaki Desk | 2 March 2016 5:30 PM GMTసినిమాలు తీయడంలో దర్శకధీరుడు రాజమౌళి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో.. ఇచ్చిన మాటకు కట్టుబడ్డంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంతకంటే కచ్చితంగా ఉంటున్నాడు. బాహుబలి చిత్రం ప్రారంభించే ముందే 2-3 ఏళ్లు బల్క్ గా డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయం ప్రభాస్ కి తెలుసు. ఆ తర్వాత బాహుబలిని రెండు భాగాలుగా తీయాల్సి రావడంతో ఈ టైం ఇంకా పెరిగింది. ఈ ఏడాది చివర్లో వస్తుందని భావించిన బాహుబలి ది కంక్లూజన్.. వచ్చే ఏడాది మధ్యలోనే అనే విషయం తేలిపోయింది.
అంటే ఇప్పటి నుంచి ఇంకో ఏడాది బాహుబలికే ప్రభాస్ అంకితం అయిపోతాడన్న మాట. కానీ ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి ఉంటుందని స్వయంగా పెదనాన్న కృష్ణంరాజు చెప్పారు. మరోవైవు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ డైరెక్షన్ లో ఓ మూవీ స్టార్ట్ చేసేందుకు కూడా సన్నాహాలు జరిగాయి. దీన్ని 2016 చివర్లో మొదలుపెట్టాలని అనుకున్నారు. ఇప్పుడు అన్ని ప్లాన్స్ నీ ప్రభాస్ వాయిదా వేసేశాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా స్టార్ట్ చేద్దామని యూవీ క్రియేషన్స్ కి ఇప్పటికే చెప్పాడట బాహుబలి. అలాగే పెళ్లి విషయంలో కూడా బాహుబలి రెండో భాగం పూర్తయ్యాకే అంటున్నాడు.
తన వ్యక్తిగత కారణాలతో బాహుబలి లాంటి సినిమాకి ఏ రకమైన అడ్డంకులు ఏర్పడకూడదన్నది ప్రభాస్ ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఏమైనా ఒక సినిమాకి 4-5 ఏళ్లు అంకితం అయిపోతున్నాడు ప్రభాస్. బహుశా ఇలాంటి ఫీట్ వేరే ఎవరికీ ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు.