Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్‌ కే వెయిట్‌ ఇంకా ఇంకా పెంచేస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   12 May 2022 2:30 AM GMT
ప్రాజెక్ట్‌ కే వెయిట్‌ ఇంకా ఇంకా పెంచేస్తూనే ఉన్నారు
X
ప్రభాస్ హీరోగా మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది ఒక పాన్ ఇండియా సినిమా కాదని.. పాన్ వరల్డ్ సినిమా అన్నట్లుగా ఉంటుందంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన వ్యాఖ్యలు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకు వెళ్లి పెట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రాజెక్ట్‌ కే సినిమా పాన్ వరల్డ్‌ సినిమా గా తీర్చి దిద్దేందుకు గాను హాలీవుడ్‌ స్థాయి టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం పని చేయిస్తున్నాడు. ప్రతి ఒక్క సన్నివేశం కూడా వావ్‌ అనేట్లుగా ఉంటుందంటూ యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో ఒక విభిన్నమైన ఊహా లోకానికి ప్రేక్షకులను తీసుకు వెళ్లేలా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ భారీ సినిమా టెక్నికల్‌ వ్యాల్యూస్ తో రూపొందుతున్న నేపథ్యంలో తారాగణం కూడా భారీగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రభాస్ వంటి పాన్‌ ఇండియా స్టార్‌ ను ఈ సినిమాలో నటింపజేయడం తోనే సినిమా స్థాయి భారీగా పెరిగింది. ఆయన చాలదు అన్నట్లుగా అమితాబచ్చన్‌.. దీపికా పదుకునే లు ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మరి కొందరు బాలీవుడ్‌ స్టార్స్ కూడా ప్రాజెక్ట్‌ కే లో చేరిన విషయం తెల్సిందే.

బాలీవుడ్‌ లేటెస్ట్‌ ట్రెండీ హీరోయిన్ దిశా పటానీ మరో హీరోయిన్ గా ప్రాజెక్ట్‌ కే లో జాయిన్ అయ్యింది. ఆమె మాత్రమే కాకుండా మరి కొందరు కూడా బాలీవుడ్‌ నుండి ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీ లో ల్యాండ్‌ అయ్యారు. వారు అంతా కూడా సినిమా స్థాయిని మరింతగా పెంచడం ఖాయం అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ మరియు దీపిక పదుకునే కాంబోలో ఇప్పటి వరకు షూట్‌ చేసిన సన్నివేశాలు మరియు కొన్ని సైన్స్ పిక్షన్ సన్నివేశాలు అద్బుతంగా వచ్చాయంటూ యూనిట్‌ సభ్యుల నుండి లీక్ అందుతోంది. సింగీతం శ్రీనివాస రావు మెంటర్‌ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఒక అద్బుతమైన విజువల్‌ వండర్ గానే కాకుండా అరుదైన సినిమా ను చూశామనే ఫీల్‌ ను కూడా కలుగజేస్తుందనే నమ్మకం ను వైజయంతి మూవీస్‌ వారు వ్యక్తం చేస్తున్నారు. విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.