Begin typing your search above and press return to search.

వాటికే 75 కోట్లు ఖ‌ర్చు చేశారా?

By:  Tupaki Desk   |   10 March 2022 12:24 PM GMT
వాటికే 75 కోట్లు ఖ‌ర్చు చేశారా?
X
`బాహుబ‌లి`తో ప్ర‌భాస్ స్టార్ డ‌మ్ ప‌తాక స్థాయికి చేరుకుంది. ఇది ఏ న‌టుడికీ అంద‌ని గౌర‌వం.. అంద‌లం అని చెప్పొచ్చు. వ‌ర‌ల్డ్ వైడ్ గా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని ఈ సినిమా ప్ర‌భాస్ కు అందించింది. దీంతో ప్ర‌భాస్ స‌నిమా వ‌స్తోందంటే అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. అలాంటి క్రేజీ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సినిమా దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత థియేట‌ర్ల‌లోకి వ‌స్తోందంటే అభిమానులు చేసే హంగామా వేరు. ఇప్పుడు `రాధేశ్యామ్‌` సినిమా విష‌యంలో అదే జ‌రుగుతోంది.

ప్ర‌భాస్ న‌టించిన రొమాంటిక్ ల‌వ్ డ్రామా `రాధేశ్యామ్‌`. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్ష‌కులు దాదాపు మూడున్న‌రేళ్లుగా ఎదురుచూస్తున్నారు. చివరికి మ‌రి కొన్ని గంట‌ల్లో అంతా ఎదురుచూస్తున్న `రాధేశ్యామ్‌` రిలీజ్ కాబోతోంది. గురువారం రాత్రి ఓవ‌ర్సీస్ లో ప్రీమియ‌ర్స్ ప‌డ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు ఒక్కొక్క‌టికి బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు.

అయితే ఇందులో 75 కోట్లు కేవ‌లం సెట్స్ కోస‌మే ఖ‌ర్చు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్ర క‌థ అంతా యూర‌ప్ నేప‌థ్యంలో సెట్ చేశారు. పాండ‌మిక్ స‌మ‌యంలో సాహ‌సించి జార్జియా వెళ్లి అక్క‌డ షూటింగ్ చేశారు. అయితే ప‌రిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవ‌డం.. లాక్ డౌన్ లు విధించ‌డంతో చేసేది లేక చిత్ర బృందం ఇండియా తిరిగి వ‌చ్చింది.

ఆ త‌రువాత కూడా జార్జియా, ఇట‌లీలో ప‌రిస్థితులు మార‌క‌పోవ‌డం, షూటింగ్ ల‌కు అనుమ‌తులు ల‌భించ‌క‌పోవ‌డంతో చిత్ర బృందం హైద‌రాబాద్ లోనే ఇట‌లీని రీ క్రియేట్ చేసింది. ఇందు కోసం భారీ సెట్స్ అవ‌స‌రం కావ‌డంతో అందు కోసం ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సెట్ ల‌ని నిర్మించారు. మొత్తం 101 సెట్ ల‌ని చిత్రీక‌ర‌ణ కోసం నిర్మించార‌ట‌.

ట్రైన్ సెట్‌, స్టేష‌న్ , షిప్ , కాఫీ షాప్‌, హీరోయిన్ హౌస్‌, చోప‌ర్‌, హాస్పిట‌ల్ సెట్ .. ఇలా సినిమాకు ప్ర‌ధానంగా కావాల్సిన సెట్ ల‌న్నింటినీ ఏర్పాటు చేశార‌ట‌. ఇట‌లీ, జార్జియాలో చేయాల్సిన సీన్స్ అన్నింటినీ ఈ సెట్ ల‌లో పూర్తి చేయ‌డంతో సినిమాకు గ్రాండియ‌ర్ లుక్ వ‌చ్చేసింది. రేపు రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ఇవే ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు. క‌థ‌కు కీల‌కంగా నిలిచే వీటి కోసం మేక‌ర్స్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా 75 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.