Begin typing your search above and press return to search.
#రాధేశ్యామ్ పోస్టర్ సస్పెన్స్! విక్రమాదిత్యుడు ఎవరు?
By: Tupaki Desk | 20 Oct 2021 5:25 AM GMTప్రభాస్ రొమాంటిక్ జోనర్ కి తిరిగి రావడం అత్యంత ఆసక్తి కలిగించే ఎలిమెంట్. `రాధే శ్యామ్`లో విక్రమాదిత్య పాత్రతో దశాబ్దం తర్వాత తిరిగి ప్రేమికుడిగా ప్రభాస్ కనిపిస్తున్నారు. ఇటీవల పూజా హెగ్డే ప్రత్యేక పోస్టర్ ఆమె పుట్టినరోజున విడుదల చేయగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్ పుట్టినరోజుకు ముందు ఒక ప్రత్యేక పోస్టర్ ని ఆవిష్కరించారు. `విక్రమాదిత్య ఎవరు?` అన్న ప్రశ్నతో పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది.
పోస్టర్ లో ప్రభాస్ ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ క్లోజప్ లుక్ చూస్తుంటే.. ఏదో ఆందోళనగా ఉన్నట్టే అనిపిస్తోంది. షార్ప్ గా చేయాల్సిన పని గురించి దీర్ఘంగానే ఆలోచిస్తున్నాడు. ఇంతకీ ఆదిత్య ఎవరు? అన్నదానికి టీజర్ లో సమాధానం దొరుకుతుందని ఆశించవచ్చు. చాలా మంది టన్నుల కొద్దీ పాజిటివ్ కామెంట్ లతో ఈ పోస్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రత్యేక విక్రమాదిత్య క్యారెక్టర్ టీజర్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23 న విడుదల కానుంది. టీజర్ లో ఆంగ్లంలో వివిధ భాషల్లో ఉపశీర్షికలతో డైలాగ్ లు ఉంటాయి. ప్రభాస్ - పూజా జంట నడుమ రొమాన్స్ ని ఈ టీజర్ ఆవిష్కరించనుంది. ఈ చిత్రం 2022 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధే శ్యామ్ బహుభాషా చిత్రంగా రిలీజ్ కానుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపికృష్ణ మూవీస్ అధినేత డా.యు.వి.కృష్ణం రాజు సమర్పణలో దీనిని యువి క్రియేషన్స్ నిర్మించింది. ఈ చిత్రాన్ని వంశీ- ప్రమోద్ - ప్రసీద నిర్మించారు. టీసిరీస్ బాలీవుడ్ లో రిలీజ్ చేయనుంది.
యూరప్ నేపథ్యంలో ప్రేమకథ
రాధేశ్యామ్ 1975 కాలంలో సాగే పీరియాడిక్ స్టోరీ. ప్రభాస్-పూజా జంట ప్రేమకథ హైలైట్ గా సాగనుంది. నాటి కాలాకానికి తీసుకెళ్లే అద్భుతమైన సెట్స్ నడుమ చిత్రీకరణ జరిపారు. మెజార్టీ పార్ట్ షూటింగ్ అంతా ఇటలీ అందాల నడుమ జరిగింది. అక్కడా ప్రత్యేకంగా కొన్ని అద్భుతమైన సెట్లు వేసి తెరకెక్కించారంటే.. ఇటలీ నేపథ్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్ధమవుతోంది. అన్నింటిని మించి రొమాంటిక్ లవ్ స్టోరీ హైలైట్ కాబోతుందని ఇప్పటికే కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇటలీ అందాల నడుమ DDLJ రేంజులో రొమాన్స్ కుదిరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసాధారణ ప్రేమకావ్యం `దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే` (డీడీఎల్ జే)ని యూరప్ లోని స్విట్జర్లాండ్ అందాల నడుమ తెరకెక్కించారు. షారూక్- కాజోల్ ఈ చిత్రంలో జంటగా నటించిన సంగతి తెలిసిందే.
ఇక రాధేశ్యామ్ కి డీడీఎల్ జే లవ్ ఫీల్ ని రాధాకృష్ణ యాడ్ చేశారని గుసగుసలు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. డార్లింగ్ ప్రభాస్- పూజా హెగ్డే ల మధ్య 1975 కాలానికి తీసుకెళ్లి...ఆ జంట మధ్య ఇటలీ రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాల కోసం... పాటల చిత్రీకరణ కోసమే కోట్లాది రూపాయలు వెచ్చించారు. పాటల చిత్రీకరణలో పూజా హెగ్డే..ప్రభాస్ ధరించిన కాస్ట్యూమ్స్ ని బట్టి సినిమాలో లవ్ స్టోరీకి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుస్తోంది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఎంత మాత్రం ఫీల్ మిస్ కాకుండా రక్తికట్టేలా వాస్తవాన్ని ప్రతిబింబించేలా రియలిస్టిక్ గానే ఆయా సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం. సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్ణణగా నిలుస్తాయని వినిపిస్తోంది.
ఈ సన్నివేశాల్ని కేవలం మేకర్స్.. సినిమాటోగ్రాఫర్.. ప్రభాస్- పూజాహెగ్డేల మధ్యన మాత్రమే ఓ ప్రయివేటు ప్లేస్ లో షూట్ చేసినట్లు సమాచారం. ఇకయాక్షన్ సన్నివేశాలు అంతే హైలైట్ కానున్నాయి. సినిమా సెట్స్ కు వెళ్లిన ఆరంభంలో ఇది కేవలం యాక్షన్ ఎంటర్ టైనర్ అని ఎక్కువగా ప్రచారం సాగింది. కానీ కాలక్రమేణా ఆ సన్నివేశాల్ని మించి రొమాంటిక్ లవ్ స్టోరీని ఎక్కువగా హైలైట్ చేస్తున్నట్లు తేలింది. సీజీ వర్క్ అసాధారణంగా ఉండనుంది. అలాగే ఇటీవలే ఓ టెంపుల్ సీన్ ని తెరకెక్కించారు. ఇందులో 100 పురోహితులు .. దాదాపు 300 మంది కార్మికులు పనిచేయడం విశేషం. దేవాలయంలో సన్నివేశాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్ధమవుతోంది. యజ్ఞ యాగాలు..క్రతువులకు సంబంధించిన సన్నివేశాలు భారీ స్థాయిలో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు కూడా సినిమాలో అంతే హైలైట్ కానున్నాయి.