Begin typing your search above and press return to search.
ప్రభాస్ రాజా డీలక్స్ టెస్ట్ షూట్.. మారుతి సక్సెస్ అయ్యాడా?
By: Tupaki Desk | 30 Oct 2022 12:37 PMయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కు మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పాన్ ఇండియా లెవల్ లో సినిమా విడుదల అవ్వాలి అంటే మరేదైనా టైటిల్ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో రాజా డీలక్స్ టైటిల్ ను రద్దు చేసుకున్నారు.
ఈ సినిమా యొక్క షూటింగ్ సైలెంట్ గా ప్రారంభం అయ్యింది. ప్రభాస్ సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి ఇప్పటికే నాలుగు రోజుల షూట్ ను ప్రభాస్ పై పూర్తి చేయడం జరిగిందట. మారుతి సినిమా షూటింగ్ నాలుగు రోజుల షెడ్యూల్ పూర్తి చేసి ప్రస్తుతం సలార్ షూట్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్.
నాలుగు రోజుల పాటు చిత్రీకరించిన రషెష్ ను ప్రస్తుతం మారుతి ఎడిటింగ్ చేయిస్తున్నాడు. ఆ ఎడిటెడ్ వర్షన్ ను ప్రభాస్ కి మారుతి చూపిస్తాడట. అది ప్రభాస్ కి నచ్చితేనే తదుపరి షెడ్యూల్ ఉంటుందని అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందులో నిజం ఎంతో కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం అలాగే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ లో చాలా మందికి మారుతి దర్శకత్వంలో సినిమా ఇష్టం లేదు. బ్యాన్ అంటూ బాయ్ కాట్ అంటూ మారుతి సినిమా ను ప్రభాస్ అభిమానులు తిరస్కరించే ప్రయత్నం చేసిన విషయం తెల్సిందే.
తాజాగా ప్రభాస్ మొదటి షెడ్యూల్ పూర్తి చేయడం.. అది రషెష్ చూసి తదుపరి నిర్ణయాన్ని ప్రభాస్ చెప్పబోతున్నాడు అంటూ వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులకు కాస్త ఊరట కలిగించే విషయం.
ప్రభాస్ మాత్రమే కాకుండా చిత్ర యూనిట్ సభ్యులు మరియు ప్రభాస్ సన్నిహితులు అంతా కూడా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మారుతి తర్వాత షెడ్యూల్ కి వెళ్తాడట. మరి ఈ రషెష్ టెస్ట్ లో మారుతి సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.
మొన్న జరిగిన షూట్ లో ప్రభాస్ తో పాటు ఇద్దరు ముగ్గురు నటీ నటులు మాత్రమే పాల్గొన్నారట. ఇప్పటి వరకు షూట్ చేసిన రషెష్ ఓకే అనుకుంటే అప్పుడు హీరోయిన్స్ ను రంగంలోకి దించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ వార్తల్లో నిజం ఎంత అనేది మారుతి స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరి ఆయన ఏం అంటాడో చూడాలి.