Begin typing your search above and press return to search.
చరణ్, ప్రభాస్ రానా.. ఓ మల్టీస్టారర్
By: Tupaki Desk | 9 Aug 2015 11:32 AM GMTతెలుగులో మల్టీ స్టారర్ మూవీస్ ఇంకెప్పటికీ చూడలేం అనుకున్నాం. కానీ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో నటించి మళ్లీ ఒకప్పటి ట్రెండుకు తెరతీశారు. ఆ ఊపులో మరిన్ని మల్టీ స్టారర్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత ఆసక్తికరమైన ఓ మల్టీ స్టారర్ కు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాబోయే శుక్రవారం బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న మల్టీ స్టారర్ మూవీ ‘బ్రదర్స్’ను తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీలో అక్షయ్ కుమార్, సిద్దార్థ్ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటించారు. దీన్ని తెలుగులో చరణ్, ప్రభాస్, రానా.. ఈ ముగ్గురిలో ఇద్దరితో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విశేషమేమిటంటే .. బ్రదర్స్ కూడా వారియర్ అనే హాలీవుడ్ సినిమాకు అఫీషియల్ రీమేక్. ఇంకా హిందీలో రిలీజ్ కాకముందే కాన్సెప్ట్ మీద నమ్మకంతో రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీలో ఈ సినిమాను నిర్మిస్తున్న రామ్ మిర్చందని స్వయంగా తెలుగు రీమేక్ పై కన్నేశారు. ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బ్రదర్స్ తెలుగు రీమేక్ కోసం ఇప్పటికే ప్రభాస్, రానా, రామ్ చరణ్ లని కలిసి మాట్లాడాను’’ అని వెల్లడించారు. ఐతే ఎవరిని ఫైనలైజ్ చేసింది.. ఎవరు సినిమాకు పచ్చజెండా ఊపింది వెల్లడించలేదు. ఐతే బాహుబలి సినిమాలో ప్రత్యర్థులుగా నటించిన భారీ కాయులు ప్రభాస్, రానాలకు ఈ సినిమా బాగానే సూటవుతుందేమో. ఇది అన్నదమ్ములైన ఇద్దరు బాక్సర్ల మధ్య సాగే పోరాటం నేపథ్యంలో సాగే సినిమా. మరోవైపు తమిళ రీమేక్ కోసం నిజంగానే అన్నదమ్ములైన సూర్య, కార్తిలతో పాటు విక్రమ్ ను కూడా కలిసినట్లు సమాచారం.