Begin typing your search above and press return to search.
కాఫీ ఇచ్చాక డార్లింగ్ లాక్ అయినట్టే?!
By: Tupaki Desk | 7 Dec 2018 5:37 PM GMTగత కొంతకాలంగా డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ గురించి ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ రిలీజ్ సమయంలో బాలీవుడ్ ఇంటర్వ్యూల్లో తనకు ఉన్న ఆసక్తిని వ్యక్తం చేశాడు ప్రభాస్. హిందీలో నటించే ఆలోచన ఉందని అన్నాడు. కానీ టాలీవుడ్ ప్రాజెక్టులతోనే బిజీగా ఉండడంతో అందుకు సమయం కేటాయించలేని సన్నివేశం ఉందని ఆ తర్వాత అర్థమైంది. బాహుబలికి ముందే కమిటైన రెండు తెలుగు సినిమాల్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాల్ని (సాహో - జాన్) శరవేగంగా పూర్తి చేసి తదుపరి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడన్నది సన్నిహితులు చెబుతున్న మాట. వాస్తవానికి ప్రభాస్ నటిస్తానంటే బాహుబలి తర్వాత అతడికి ఓ భారీ ఆఫర్ ని ఇచ్చాడు దర్శకనిర్మాత కరణ్ జోహార్. కానీ ప్రభాస్ వద్దనుకున్నాడని అప్పట్లో ప్రచారమైంది. ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే ఇకపై డార్లింగుకి అందుకు ఆస్కారం లేకుండా చేయాలన్నది కరణ్ జోహార్ ఆలోచన అని తెలుస్తోంది.
అందుకే ఇప్పుడు ఏకంగా బాహుబలి టీమ్ ని కాఫీ విత్ కరణ్ సీజన్ 6 కి పిలుస్తున్నాడు కరణ్ జోహార్. ప్రభాస్ - రానా - రాజమౌళి బృందాన్ని ఇప్పటికే ఈ షోలో పాల్గొనాల్సిందిగా అతడు కోరాడు. ఈ షోకి పిలిచి డార్లింగ్ ప్రభాస్ ని లాక్ చేయాలన్నది మాష్టర్ మైండ్ కరణ్ జోహార్ ప్లాన్ అని తెలుస్తోంది. అసలే బుల్లితెర షోలు - కార్యక్రమాలు చేసిన అలవాటు తనకు లేకపోయినా `బాహుబలి` పంపిణీదారుడు అయిన కరణ్ ఇచ్చిన ఆఫర్ ని ప్రభాస్ కాదనలేకపోయాడు. పైగా అతడు నటించిన `సాహో` చిత్రాన్ని హిందీలోనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి కరణ్ ప్రపోజల్ ని తిరస్కరించలేదట. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో పాల్గొంటే సౌత్ నుంచి పాల్గొన్న తొలి స్టార్ ప్రభాస్ అని చెప్పొచ్చు. రానా - రాజమౌళికి ఆ పేరు దక్కుతుంది. ఇక షోలో ప్రభాస్ రెండు సీరియస్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది అనుష్కతో తన ప్రేమ - పెళ్లి వ్యవహారం.. బ్యాచిలర్ షిప్ ని వదిలేసే వ్యవహారంపై!! అలాగే బాలీవుడ్ సినిమాకి సంతకం చేసే మ్యాటర్!! అంటూ అప్పుడే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటివరకూ కరణ్ షోకి షెడ్యూల్ ఖరారు కాలేదు. ఈనెలాఖరుకి పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుందట.