Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌ రాణీ క‌న్ఫామ్‌.. రౌడీ పెండింగ్‌లో!

By:  Tupaki Desk   |   30 Jan 2021 12:30 PM GMT
ప్ర‌భాస్‌ రాణీ క‌న్ఫామ్‌.. రౌడీ పెండింగ్‌లో!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ సలార్. ఈ చిత్రం ఇటీవ‌లే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే.. బాహుబ‌లితో త‌న క‌టౌట్‌ ఏంటో చాటి చెప్పాడు రెబ‌ల్ స్టార్‌. ఇక‌, KGF త‌న స్టామినా ఏంటో కూడా పిక్చ‌ర్ క్లియ‌ర్ చేశాడు ప్ర‌శాంత్ నీల్‌. మ‌రి, వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రాబోతున్న మూవీ ఎలా ఉంటుంది? ఇదే.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌.

ప్రభాస్ ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఏది ముందుగా రిలీజ్ అవుతుందో ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టంగా ఉంది. ప్ర‌స్తుతం చేస్తున్న‌ రాధేశ్యామ్ రేపో మాపో పూర్తవుతుంది. దీన్ని మేలో.. లేదంటే జూన్ లో రిలీజ్ చేయవచ్చని టాక్. జిల్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని త‌ర్వాత స‌లార్ వేగంగా క‌దులుతోంది.

ఈ చిత్రం ప్రారంభం కాకుండానే అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుందో గానీ.. గాసిప్స్ తోనే 'అంత‌కు మించి' అన్న రీతిలో అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉన్నట్లు సోష‌ల్ రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కానీ.. విజయ్ సేతుపతి ఈ రూమ‌ర్ పై స్పందించాడ‌ట‌. తన దగ్గరకు ఇంతవరకు అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని చెప్పాడ‌ట‌. ఈ మేర‌కు కోలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే.. ప్ర‌భాస్ హీరోయిన్‌ మాత్రం క‌న్ఫామ్ అయ్యింది. ఇందు‌లో శృతి హాసన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఆ విధంగా.. సలార్ మహారాణి శృతి అని క్లారిటీ వ‌చ్చేసింది.

ఇక‌, విజ‌య్ సేతుప‌తి గురించి స్ప‌ష్టత రావాల్సి ఉంది. ‘మాస్టర్’లో సేతుపతి పాత్ర క్లిక్కవ్వడంతో సలార్ లో కూడా అతన్నే విలన్ గా తీసుకోవాలని యూనిట్ భావిస్తున్నట్టు టాక్. కానీ.. సేతుపతి వద్దకు ఇంకా ఆ ఆఫర్ రాలేదని చెప్తున్నాడట. మరి, ఏం జరుగుతుంది? ఎవ‌రిని ఫైన‌ల్ చేస్తారు? అన్న‌ది తేలాల్సి ఉంది. 2022 సంక్రాంతికి ఈ మూవీని బ‌రిలోకి దించాల‌ని యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.