Begin typing your search above and press return to search.
అదే నిజమైతే ప్రభాస్ కొత్త రికార్డ్ సెట్ చేసినట్టే!
By: Tupaki Desk | 23 Jun 2022 5:29 AM GMT'బాహుబలి' సిరీస్ చిత్రాలు ఒక్కసారిగా టాలీవుడ్ స్వరూపాన్నే మార్చేశాయి. ఈ సినిమా కారణంగా మన మార్కెట్ స్థాయి పెరిగింది. సినిమాల బడ్జెట్ లు కూడా గణనీయంగా పెరిగాయి. లాభాలు కూడా అదే స్థాయిలో దక్కుతున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా మన సినిమాలకు కలెక్షన్ ల వర్షం కురుస్తోంది. దీంతో మన హీరోలు కూడా డిమాండ్ ని, పెరిగిన మార్కెట్ ని బట్టి భారీ స్థాయలో పారితోషికాలని పెంచేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు 50 కోట్ల నుంచి 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ లని పెంచేశారు.
కొంత మంది రెమ్యునరేషన్ స్థానంలో వచ్చే లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. దీంతో రెమ్యునరేషన్ లకు మించి కొంత మంది హీరోలకు భారీగానే ముడుతోంది. సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయి విప్లవాత్మక మార్పులకు కారణమై పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ ప్రభాస్. తను కూడా భారీగానే పారితోషికాన్ని పెంచేశారని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి 2 పార్ట్స్ కి కలిపి ప్రభాస్ 50 కోట్లకు మించి తీసుకున్నారట.
అయితే ఆ తరువాతే పెంచడం మొదలు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. 'బాహుబలి' సీరిస్ తరువాత ప్రభాస్ నటించిన మూవీ 'సాహో'. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలోనే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
ఈ మూవీని సొంత నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ లో చేశారు. దీనికి లాభాల్లో ప్రభాస్ వాటా తీసుకున్నారట. ఇటీవల విడుదలైన మరో పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' కు మాత్రం రూ. 75 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నారట.
యువీతో పాటు టి సిరీస్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా నిలిచి భారీ నష్టాలని అందించింది. దీంతో ప్రభాస్ తన పారితోషికాన్ని 75 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచినట్టుగా చెబుతున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'సలార్', బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ రూపొందిస్తున్న 'ఆది పురుష్' చిత్రాలకు ప్రభాస్ రూ. 100 కోట్లు ఛార్జ్ చేశారట.
అయితే దీన్ని తాజాగా రూ. 120 కోట్లకు పెంచినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే దక్షిణాదిలో అత్యంత బారీ స్థాయిలో పారితోషికాన్ని అందుకుంటున్న ఏకైక హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డుని సాధించడం ఖాయం అని చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్స్ దాదాపు గా ఈ స్థాయికి మించే పారితోషికాలు తీసుకుంటున్నారు. వారి సరసన ప్రభాస్ నిలవడం ఖాయమని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.