Begin typing your search above and press return to search.

పది కిలోలు తగ్గనున్న డార్లింగ్

By:  Tupaki Desk   |   4 Sep 2018 9:51 AM GMT
పది కిలోలు తగ్గనున్న డార్లింగ్
X
భారీ వ్యయంతో పాటు అత్యున్నత స్థాయిలో గ్రాఫిక్స్ వాడుతున్న కారణంగా సాహో విడుదల విషయంలో స్పష్టత లేకపోయినా రెబెల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ స్క్రిప్ట్ కూడా సాహో లాగే బాహుబలి టైంలోనే ఓకే చేసింది. ఇప్పటికి కుదురుతోంది. సెప్టెంబర్ 6న అంటే ఎల్లుండి పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఓకే చేశారన్న వార్త ఇప్పటికే షికారు చేస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా లైన్ లో ఉందని ఇద్దరిలో ఒకరు ఉండవచ్చని మరో టాక్ కూడా వచ్చింది. ఒకవేళ ఏదైనా డేట్స్ సమస్య వల్ల ఈ ఇద్దరూ చేయలేకపోతే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ గా రాశి ఖన్నా పేరు కూడా పరిశీలనలో ఉందని మరో అప్ డేట్ కూడా ఉంది. వీటికి శుక్రవారం చెక్ పెడతారా లేక తర్వాత ప్రకటిస్తామని చెబుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. జిల్ లో గోపీచంద్ ను డీల్ చేసిన స్టైల్ నచ్చడంతో పాటు యూరోప్ నేపథ్యంలో కొత్త తరహా కథను చెప్పిన విధానం నచ్చడంతో ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణకు ఓకే చెప్పినట్టు తెలిసింది.

దీనికి మరో ప్రత్యేకత ఉంది. ఈ పాత్ర కోసం ప్రభాస్ 10 కిలోలకు పైగా బరువు తగ్గబోతున్నాడట. బాహుబలి తర్వాత సాహోలో చేస్తున్నది పవర్ ఫుల్ యాక్షన్ పాత్ర కావడంతో బలిష్టమైన దేహం కోసం ప్రభాస్ ఎక్కువగా మేకోవర్ చేసుకోలేదు. కానీ రాధాకృష్ణ సినిమా కోసం కాస్త స్లిమ్ గా కనిపించాల్సిన అవసరం ఉండటంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు కీలకమైన షెడ్యూల్ ఉన్న సాహోలో తన పార్ట్ పూర్తి కాగానే ప్రభాస్ కసరత్తులు మొదలుపెడతాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందే ఈ మూవీ చాలా డిఫరెంట్ సెటప్ లో ఉంటుందట. షూటింగ్ ఎప్పటిలోపు పూర్తి చేస్తారు విడుదల ఎప్పుడు ఉండొచ్చు లాంటి వివరాలు ఓపెనింగ్ రోజు తెలిసే అవకాశం ఉంది. లవర్ బాయ్ పాత్రలు వదిలేసి మాస్ కు షిఫ్ట్ అయిపోయిన ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత ప్రేమికుడిగా కనిపించబోతున్నాడు.