Begin typing your search above and press return to search.
అందుకే ప్రభాస్ పద్మావత్ కు 'నో' చెప్పాడా?
By: Tupaki Desk | 15 Aug 2018 2:30 PM GMTబాలీవుడ్ లో ఉన్న టాప్ ఫిలింమేకర్స్ లో సంజయ్ లీలా భన్సాలి ఒకరు. ఆయన లాస్ట్ సినిమా 'పద్మావత్' బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కర్ణిసేన బెదిరింపులు.. రాజ్ పుత్ వంశంలోని రాణి అయిన పద్మావతిదేవి పాత్రను తప్పుగా చూపిస్తున్నరంటూ అందోళనలు కూడా చెలరేగాయి. వాటన్నిటినీ దాటుకుని, సెన్సార్ ఇబ్బందులను కూడా ఎదుర్కొని జనవరి 25 న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచింది. బాలీవుడ్ అల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టు లో ఏడవ స్థానం లో నిలిచింది. కానీ ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే ప్రభాస్ 'నో' చెప్పాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
'పద్మావత్' సినిమాలో దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లు ముఖ్యపాత్రలలో నటించిన విషయం తెలిసిందే కదా. 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ నటనకు ఫిదా అయిన సంజయ్ లీలా భన్సాలి మహారావాల్ రతన్ సింగ్ సింగ్ పాత్రను షాహిద్ కపూర్ కంటే ముందుగా ప్రభాస్ కు ఆఫర్ చేశాడట. కానీ భన్సాలి ఆఫర్ ను ప్రభాస్ సున్నితంగా తిరస్కరించాడట. షాహిద్ పాత్ర వీక్ గా ఉండటం, పైగా సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతోనే ప్రభాస్ ఈ అవకాశాన్ని వదులుకున్నాడని సమాచారం. బాహుబలిలో లో పీక్ హీరోయిజం ఉన్న పాత్రలో నటించి ఇప్పుడు ఇలా ఉంటే ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందో లేదో అని కూడా సందేహించాడట. ఇవన్నీ ఒక ఎత్తైతే, 'సాహో' కు కమిట్ అయి ఉండడం కూడా మరో కారణం.
నిజానికి సినిమాలో షాహిద్ పాత్ర కంటే రణవీర్ సింగ్ - దీపిక పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సినిమా రిలీజ్ తర్వాత కూడా దాదాపు అందరూ రణవీర్ సింగ్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఒకవేళ ప్రభాస్ ఆ రోల్ చేసి ఉన్నా కొత్తగా వచ్చే ఉపయోగమేమీ లేదు. ఆరకంగా ప్రభాస్ మంచి డెసిషన్ తీసుకున్నట్టే!