Begin typing your search above and press return to search.
పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!
By: Tupaki Desk | 29 April 2020 5:27 PM GMTటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు డార్లింగ్ ప్రభాస్. గత కొన్నేళ్లుగా డార్లింగ్ పెళ్లి పై వచ్చిన వార్తలు ఇంకా ఏ హీరో పై రాలేవని చెప్పాలి. ప్రభాస్ పెళ్లి పై ఎన్నో పుకార్లు ఎన్నో వివాదాలు.. కానీ ఇంతవరకు తేలని విషయం. ఇది ఇప్పట్లో తేలే విషయం కాదని అందరికి తెలుసు. అందుకే ఏవేవో రాసేస్తుంటారు. మరి ఆ వార్తలు నిజమా కదా ఎవరికి అవసరం లేదు. అది ప్రభాస్ పెళ్లి వార్త అయితే చాలు. ఈ మధ్య ప్రభాస్ పెళ్లికోసం కృష్ణం రాజు ఓ అమ్మాయిని చూసేశాడని.. గతంలో అనుష్కతో పెళ్లి అని, తాజాగా నిహారికతో అని ఎవరికి నచ్చిన వార్తలు వారు స్ప్రెడ్ చేశారు. కానీ మొత్తానికి ప్రభాస్ తన పెళ్లి వార్తలపై స్పందించాడు.
మోస్ట్ ఎలిజిబుల్ హ్యాండ్సమ్ ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడైనా వైరలే. పెళ్లికూతురు ఎవరనేది మాత్రం మీడియా కల్పించిందే. స్నేహితులమేనని అనుష్క - ప్రభాస్ ఎన్ని సార్లు చెప్పినా.. రాసేస్తారు. మెగా డాటర్ నిహారికతో పెళ్లి ఫిక్స్ అయిందని మీడియా హల్చల్ చేసేసింది. వీటిపై మెగా ఫ్యామిలీ ఎన్నోసార్లు స్పందించారు. తాజాగా నిహారిక స్వయంగా ప్రభాస్ తో పెళ్లి వార్తలను తప్పని తోసిపుచ్చింది. ఇన్ని రకాలుగా హల్చల్ చేస్తున్న పెళ్లి వార్తలపై ప్రభాస్ స్పందించాడు. తనకు పెళ్లంటే అయిష్టం లేదని.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. అయితే ఎప్పుడనేది మాత్రం చెప్పలేను అన్నాడు. అసలు నా పెళ్లి విషయం మా ఫ్యామిలీ కంటే మీడియా వారికే ఆత్రం ఎక్కువ ఉందని కౌంటర్ వేశాడు. పెళ్లి జరగుతుంది. జరగాల్సినప్పుడు అంటూ సెలవిచ్చాడు.