Begin typing your search above and press return to search.
జగనన్నకు రెబల్ రెక్వస్ట్
By: Tupaki Desk | 11 Feb 2022 3:05 AM GMTఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు సినీపరిశ్రమను సందిగ్ధంలో పడేసిన సంగతి తెలిసిందే. సినీపెద్దలు ఎవరికి వారు సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన వారిలో చిరంజీవి- ప్రభాస్ - మహేష్ వంటి టాప్ హీరోలు ఉన్నారు. సమావేశంలో టికెట్ ధరలతో పాటు పరిశ్రమ సమస్యలన్నిటినీ మన స్టార్ హీరోలు ప్రస్థావించారు. జగన్ సానుకూలంగా స్పందించారని కూడా సమావేశ అనంతరం మీడియా సమక్షంలో వెల్లడించారు.
ఈ సమావేశం అనంతరం మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వారం రోజుల్లోనే తీపి కబురు అందుతుందని చిరు ప్రకటించారు. కానీ టికెట్ ధరలపై మార్పు ఉంటుందని ఎవరూ భావించడం లేదు. ఇదే ప్రకటన వైయస్ జగన్ నుంచి వచ్చి ఉంటే దానిని కాన్ఫామ్ చేసుకునేవారు.
ఇక ఈ సమావేశం అనంతరం డార్లింగ్ ప్రభాస్ ప్రత్యేకంగా సీఎం జగన్ ని ఏమని అభ్యర్థించారంటే.. నెల్లూరు సూళ్లూరు పేటలో తాము అత్యంత భారీ స్క్రీన్ ని నిర్మించామని దానికి ఇప్పుడున్న టికెట్ రేట్ల దెబ్బ పెద్దగా ఉందని సీఎంకి తెలుపుతూ టికెట్ ధరల్ని అన్నిటికీ ఒకేలా నిర్ణయించడం సరికాదని అన్నారు.
నెల్లూరు- సూళ్లూరుపేటలో దక్షిణాసియాలో అతిపెద్ద మల్టీప్లెక్స్ స్క్రీన్ అయిన V-ఎపిక్ సినిమా ప్రభాస్ అండ్ స్నేహితుల బృందానిది అన్న సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తుత రేట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో సినిమాలను నడపలేమనే ఇప్పటికే ఈ స్క్రీన్ ని మూసేసారు. అందుకే ప్రభాస్ జగన్ ను అభ్యర్థించాడు. టిక్కెట్ ధరలపై తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. మల్టీప్లెక్స్ లో డాల్బీ అట్మాస్ అడ్వాన్స్ డ్ 3డి సరౌండ్ సిస్టమ్.. 106 అడుగుల వెడల్పాటి పొడవాటి స్క్రీన్ ని అమర్చిన ఈ థియేటర్ లో 676 మంది సినిమాని వీక్షించవచ్చు. పెద్ద మల్టీప్లెక్స్ ల ధరలను ఇతర థియేటర్ ల మాదిరిగానే నిర్ణయించడం అన్యాయమని ప్రభాస్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న థియేటర్ ధరలను సమీక్షించాలని ఆయన కోరారు.
అయితే ఆయన మొర జగన్ విన్నారా? అంటే ఇంతవరకూ ఎలాంటి హామీని ఆయన ఇవ్వకపోవడం బాధాకరం. టిక్కెట్ ధరల సమస్యలు.. ఇతర సమస్యలను ఓపికగా విన్న జగన్.. కమిటీ సమావేశంలో వివాదాస్పద అంశాలపై చర్చిస్తానని అన్నట్టు సమాచారం. ఐదు షోలను మళ్లీ ప్రవేశపెట్టడం మినహా ఇతర విషయాలపై సీఎం హామీ ఇవ్వలేదు. సమావేశం ముగిసే వరకు టికెట్ ధరలపై ఎలాంటి స్పష్టత లేదట. థియేటర్లలో రెండు తరగతులు మాత్రమే ఉంటాయని సమస్య కోర్టులో ఉన్నందున అధికారులు ఈ విషయంపై మాట్లాడలేదని జగన్ తేల్చారు.
డిసెంబర్ లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ కోసం ఈ అంశాన్ని వాయిదా వేసింది. అనంతరం ఆ కమిటీ చాలా అంశాలను పరిశీలించింది.
కమిటీ ఇంతకీ ఏం తేల్చినట్టు?
టికెట్ లొల్లు తీరేదెలా? అంటూ చాలా కాలంగా టాలీవుడ్ ప్రముఖులు ఎదురు చూస్తున్నారు. కమిటీలు ఏదీ తేల్చకపోవడం కోర్టులతో పనవ్వకపోవడంపై చాలా నిరాశగా ఉన్నారు. అయితే ఇక ఈ నిరాశను పారద్రోలే సమయం వచ్చింది. ఎట్టకేలకు కమిటీ తుది నివేదికను సమర్పించిందని తెలిసింది. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. థియేటర్లలో కనీస ధర రూ.40.. గరిష్ఠ ధర రూ.150గా ఉండాలని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని టాక్ వినిపించింది.
ఎయిర్ కూల్ థియేటర్లకు కనీస ధర రూ.40 కాగా.. గరిష్ఠ ధర రూ.120గా ఉండాలని కమిటీ సూచించిందని సమాచారం. నాన్ ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.30 కాగా.. గరిష్ఠ ధర రూ.70గా ఉండాలని కమిటీ తేల్చిందట.