Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ బ్యాక్ ఇన్ యాక్ష‌న్‌!

By:  Tupaki Desk   |   22 Sep 2022 5:30 PM GMT
పాన్ ఇండియా స్టార్ బ్యాక్ ఇన్ యాక్ష‌న్‌!
X
పాన్ ఇండియా స్టార్ మ‌ళ్లీ యాక్ష‌న్ లోకి దిగిపోయారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. సీనియ‌ర్ న‌టుడు, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవ‌ల తీవ్ర అనారోగ్య కార‌ణాల వ‌ల్ల సెప్టెంబ‌ర్ 11న గ‌చ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆకాల మ‌ర‌ణంలో యావ‌త్ ఇండ‌స్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. వ్య‌క్తిగ‌తంగా స్టార్ హీరో ప్ర‌భాస్ తన రెండు ఫ్యామిలీల పెద్ద దిక్కుని కోల్పోయి షాక్ లోకి వెళ్లిపోయాడు.

ప్ర‌తీ విష‌యంలోనూ త‌న‌కు అండ‌గా వుండే పెద‌నాన్న కృష్ణంరాజు మృతి చెంద‌డంతో ప్ర‌భాస్ ఒక్క‌సారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన విష‌యం తెలిసిందే. అయితే బుధ‌వారం 11 డేస్ పూర్త‌యిపోవ‌డంతో ప్ర‌భాస్ యాక్ష‌న్ అంటూ త‌న‌ని న‌మ్ముకున్న డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్ల కోసం.. ఇత‌ర న‌టీన‌టుల కాల్షీట్ల‌కు ఇబ్బంది క‌లిగించ‌కూడ‌ద‌నే ఉద్దేశంలో ప్ర‌భాస్ బుధ‌వారం నుంచి సెట్ లోకి ప్ర‌వేశించిన‌ట్టుగా తెలుస్తోంది.

`కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న `స‌లార్` సెట్‌లో ప్ర‌భాస్ సంద‌డి చేశార‌ట‌. ఈ మూవీ కీల‌క ఘ‌ట్టాల‌కు సంబంధించిన షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ప్ర‌భాస్ పాల్గొన‌గా 12 సెట్ ల‌లో షూటింగ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే 12 సెట్ ల‌ని నిర్మించి కొన్ని రోజుల‌వుతోంది. ఈ ఒక్కో సెట్ లో కేవ‌లం మూడు రోజులకు మించి షూటింగ్ వుండ‌ద‌ట‌. అందు కోస‌మే ప్ర‌భాస్ వెంటనే సెట్ లోకి అడుగుపెట్టిన‌ట్టుగా తెలుస్తోంది.

కృష్ణంరాజు మృతి కార‌ణంగా ప్ర‌భాస్ మ‌రో వారం వ‌ర‌కు సెట్ లోకి అడుగుపెట్ట‌డం క‌ష్టం అని `స‌లార్‌` టీమ్ భావించింది. కానీ ప్ర‌భాస్ వారి టైమ్ ని వేస్ట్ చేయ‌డం ఇష్టం లేక బుధ‌వారం నుంచే షూటింగ్ కి వ‌చ్చేయ‌డంతో అంతా స‌ర్ ప్రైజ్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. గురువారం ప్ర‌భాస్ తో పాటు హీరోయిన్ శృతిహాస‌న్‌, కీల‌క న‌టీన‌టులంతా పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌కు సంబంధించిన షూటింగ్ ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్రారంభించార‌ని తెలిసింది.

ఈ షూటింగ్ ఈ నెలాఖ‌రు వ‌రకు జ‌ర‌గ‌నుంద‌ని, ప్ర‌భాస్ కూడా నెలాఖ‌రు వర‌కు షూటింగ్ లో పాల్గొంటార‌ట‌. ద‌స‌రాకు చిన్న బ్రేక్ తీసుంటార‌ట‌. ఆ త‌రువాత షూటింగ్ కంటిన్యూ చేస్తార‌ట‌. అయితే అక్టోబ‌ర్ నుంచి ప్ర‌భాస్ `స‌లార్‌` తో పాటు `ప్రాజెక్ట్ కె` మూవీకి కూడా డేట్స్ కేటాయించార‌ట. `స‌లార్‌` చేస్తూనే `ప్రాజెక్ట్ కె`ని కూడా పూర్తి చేస్తాడ‌ని తెలుస్తోంది. ఇక న‌వంబ‌ర్ నుంచి మారుతితో చేయ‌బోతున్న మూవీని ప‌ట్టాలెక్కిస్తార‌ట‌. ప్ర‌భాస్ న‌టించిన `ఆదిపురుష్` కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని అక్టోబ‌ర్ 2న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టుగా తెలిసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.