Begin typing your search above and press return to search.
డార్లింగ్ మాటలు కూడా ప్యూరే
By: Tupaki Desk | 22 Aug 2019 6:41 AM GMTఇంకో 8 రోజుల్లో సాహోతో సందడి చేయబోతున్న డార్లింగ్ ప్రభాస్ రిజల్ట్ పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. ఫలితం మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ అది ప్రేక్షకుల తీర్పు రూపంలో వసూళ్ళ లెక్కల్లో వస్తే వచ్చే ఆనందం ఇంకేది ఇవ్వదు. దీని కోసమే గత నెల రోజులుగా మీడియాకు విస్తృతంగా అందుబాటులో ఉంటూ విపరీతంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఆయా ఇంటర్వ్యూలలో భాగంతో తన లోపాలను ఏ మాత్రం మొహమాటపడకుండా ఒప్పేసుకోవడం గమనార్హం.
తనకు నటన పరంగా ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని కేవలం గొంతుతో హై పిచ్ తో భావాలను పలికించాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతోందని దాన్ని త్వరలోనే అధిగమిస్తానని చెప్పాడు. నిజానికి బాహుబలి 2 క్లైమాక్స్ తో పాటు సాహో టీజర్ లోనూ డార్లింగ్ వాయిస్ మీద కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు తనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఏమి లేకపోయినా అన్ని ఉన్నట్టు బిల్డప్ ఇచ్చే కొందరు హీరోల కన్నా ప్రభాస్ చాలా గ్రేట్ అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
నిజంగానే ప్రభాస్ ఈ ఒక్క వీక్ నెస్ ని ఓవర్ కం కాగలిగితే ఇండియన్ బెస్ట్ యాక్టర్స్ లో ఒకడిగా చిరస్థానం సంపాదించుకోవచ్చు. ఎలాగూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇదొక్కటి మెరుగుపర్చుకుంటే అంతకంటే అభిమానులకు కావాల్సింది ఏముంది. అయినా సాహో యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి బాహుబలి తరహాలో భారీ డైలాగులు వల్లెవేసే అవసరం ఉండదు. సెన్సార్ పూర్తి చేసుకున్న సాహో ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.