Begin typing your search above and press return to search.
జక్కన్న అసలు బాహుబలి వద్దనుకున్నాడా?
By: Tupaki Desk | 13 Feb 2016 1:16 PM GMTబాహుబలి.. ఇండియన్ సినిమా స్థాయినే ఎన్నో మెట్లు ఎక్కించిన సినిమా. ఈ సినిమాను చూసి తెలుగు వాళ్లందరూ గర్విస్తున్నారు. ఐతే ఒక్కసారి ఈ సినిమా అసలు తెర మీదికే రాకపోయి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోండి.మొగ్గ దశలోనే రాజమౌళి బాహుబలిని తుంచేసి ఉంటే.. నిర్మాతలు మా వల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేసి ఉంటే ఏమై ఉండేదో ఆలోచించండి.నిజానికి శోభు యార్లగడ్డ - ప్రసాద్ దేవినేని ఏమాత్రం వెనుకంజ వేసినా ఈ ప్రాజెక్టు ఉండేదే కాదట. బాహుబలి సినిమాకు అయ్యే ఖర్చు చూసి బెంబేలెత్తిన జక్కన్న అసలీ సినిమానే వద్దనుకున్నాడట. ఐతే నిర్మాతలు ధైర్యంగా ముందడుగు వేయబట్టే ఈ సినిమా తెరమీదికి వచ్చిందట. దుబాయ్ లో గామా అవార్డుల కార్యక్రమంలో ప్రభాస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘‘ముందు బాహుబలి ఒక పార్ట్ అనే అనుకున్నాం. రాజమౌళి కథ మొత్తం నరేట్ చేయడం పూర్తయ్యాక పేపర్ మీద బడ్జెట్ లెక్కలేస్తే.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది కమర్షియల్ గా వర్క్ అవుట్ అవదని రాజమౌళే నిర్మాతలకు చెప్పేశాడు. ప్రభాస్ తో బాక్సింగ్ నేపథ్యంతో ఓ సినిమా చేద్దామని చెప్పాడు. ప్రభాస్ సంగతేంటి అని అడిగితే.. అతను నా బెస్ట్ ఫ్రెండ్ నేను చూసుకుంటానులే అని రాజమౌళి చెప్పాడు.కానీ సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న శోభు యార్లగడ్డ - దేవినేని ప్రసాద్ మాత్రం 'ఎంత ఖర్చైనా ఫరవాలేదు మేము సప్పోర్ట్ చేస్తాం బడ్జెట్ లెక్కలు చూసుకోవద్దు. గో అహెడ్' అంటూ ఈ సినిమాకు ప్రాణం పోశారు’’ అని ప్రభాస్ చెప్పాడు.