Begin typing your search above and press return to search.
మమ్ముట్టి లైన్ మీద ప్రభాస్@20?
By: Tupaki Desk | 3 Oct 2018 11:04 AM GMTకొన్ని సినిమాల షూటింగ్ మొదలు కాకుండానే విపరీతమైన ఆసక్తి రేపుతాయి. అందులోనూ బాహుబలి ప్రభాస్ లాంటి హీరోలవైతే మరీ ఎక్కువ. సాహో ఆలస్యం వల్ల ఫ్యాన్స్ ఎంత అసహనంగా ఉన్నా విడుదల ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు వేసవి అంటున్నారు కానీ ఖచ్చితంగా ఫలానా టైంలో వస్తాం అని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంచితే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే మరో సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రభాస్ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న రాధాకృష్ణ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది.
ఇటలీతో పాటు యూరోప్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా చాలా పాత కాలంలో అంటే ఓ ఎనభై తొంబై ఏళ్ళ క్రితం మొదలుపెట్టి వర్తమానానికి లింక్ పెడతారని తెలిసింది. కాకపోతే దీనికి సంబందించిన మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో ప్రభాస్ పాత్ర భవిష్యత్తును ముందుగానే ఊహించే తరహాలో ఉంటుందట. దాని వల్ల జరగబోయే విపత్తులను ఆపడంలో సక్సెస్ అవుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే హీరోయిన్ పూజా ఓ ప్రమాదంలో ఉందని ముందే గుర్తించిన ప్రభాస్ తనను కాపాడి ఆపై ప్రేమలో పడేలా కొత్త కొత్త మలుపులతో ఉంటుందని టాక్.
అచ్చంగా ఇదే కాదు కానీ ఈ థీమ్ తో 1991లో అయ్యర్ ది గ్రేట్ అని మమ్ముట్టి హీరోగా మలయాళం ఓ సినిమా వచ్చింది. సూర్య ది గ్రేట్ పేరుతో తెలుగులో కూడా డబ్ చేసారు. జరగబోయే ప్రమాదాలు సంఘటనలు ముందే ఊహించే శక్తి ఉన్న మమ్ముట్టి ఓ విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడతాడు. పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటున్న విలన్ల భరతం కూడా ఇదే తరహాలో పడతాడు. ఇలా ఊహకందని ట్విస్టులతో క్లైమాక్స్ కూడా కొత్తగా ఉంటుంది. ప్రభాస్ 20లో కేవలం హీరోకున్న లక్షణం మాత్రమే దీన్ని పోలి ఉంటుందని మిగిలినదంతా పూర్తిగా డిఫరెంట్ నేరేషన్ లో కొత్త తరహా స్క్రీన్ ప్లే తో సాగుతుందని టాక్. ఇది నిజమో కాదో తెలియడానికి చాలా టైం పడుతుంది కానీ మొత్తానికి కొత్త తరహా కథలతో ప్రభాస్ ప్రయోగాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది