Begin typing your search above and press return to search.

ప్రభాస్ రొమాంటిక్ మోడ్

By:  Tupaki Desk   |   28 April 2023 1:00 PM GMT
ప్రభాస్ రొమాంటిక్ మోడ్
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాజా డీలక్స్ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ సిద్ధం అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ మూవీ ఉంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతోన్న ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్ కి తాతగా కనిపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

అలాగే సత్యరాజ్ డార్లింగ్ తండ్రిగా కనిపిస్తారంట. ఇదిలా ఉంటే ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా మాళవిక మోహనన్ కనిపిస్తుందట. ఆమెతో ప్రభాస్ కి మంచి లవ్ ట్రాక్ కూడా ఉంటుందంట. ఇక మూవీలో వారిద్దరి రొమాంటిక్, లవ్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయంట.

లవ్ ట్రాక్ రొమాంటిక్ గా ప్రేక్షకులకి ఎంగేజ్ చేస్తూనే కావాల్సినంత ఫన్ కూడా క్రియేట్ చేస్తుందంట. మాళవిక మోహనన్ కూడా ఇప్పటికే రాజా డీలక్స్ మూవీలో తాను మెయిన్ హీరోయిన్ గానే నటిస్తున్న అని చెప్పారు. ఇక మూవీలో ప్రభాస్ కూడా చాలా హ్యాండ్ సమ్ లుక్ లో కనిపిస్తాడంట. అతని ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ వీలైనంత ఫ్రెష్ గాకొత్తగా ఉండేలా మారుతి క్యారెక్టరైజేషన్ రాసుకున్నారంట.

ఈ నేపధ్యంలో ఈ మూవీ కచ్చితంగా డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ 25 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసే విధంగా మారుతి ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. గ్రాఫిక్స్ కి సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుందనే మాట వినిపిస్తోంది.

ప్రభాస్ రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్ షేరింగ్ తో మూవీ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తోనే పూర్తి చేసే ప్రయత్నం నిర్మాతలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.