Begin typing your search above and press return to search.
ప్రభాస్ సొంత ఊళ్లో 'సాహో ' టిక్కెట్ రేటు చూస్తే షాకే
By: Tupaki Desk | 29 Aug 2019 4:57 AM GMTసాహో... సాహో... సాహో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో నామస్మరణ జరుగుతోంది. దేశాన్ని సాహో ఫీవర్ ఒక రేంజ్ లో ఊపేస్తోంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సాహో హంగామా గురువారం నుంచే మొదలుకానుంది. అమెరికాలో గురువారమే ప్రీమియర్లు వేస్తుండగా... భారతదేశంలో మాత్రం గురువారం అర్ధరాత్రి నుంచి సాహో హంగామా మొదలుకానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ముందుగా ఏపీలోనే ప్రీమియర్లు పడతాయని అంచనా వేస్తున్నారు.
బుక్ మై షో లాంటి టికెట్ యాప్‌లలో బాలీవుడ్ స్టార్ హీరోలుగా చెప్పుకునే ఖాన్ల సినిమాలకే మూడు నాలుగు లక్షల లైక్స్ వస్తే గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది ఖాన్ ల సినిమాలకు వచ్చే లైక్స్ సులువుగా దాటేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సాహో క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనే కాదు అటు తమిళనాడు రాజధాని చెన్నై - కర్ణాటక రాజధాని బెంగళూరు - కేరళలోని ప్రముఖ నగరాల్లోనూ సాహో ఫీవర్ మామూలుగా లేదు.
మరి బయట దేశాలు - రాష్ట్రాల్లోనే అలా ఉంటే ఇక ప్రభాస్ సొంత జిల్లా - సొంత ప్రాంతాల్లో ఇంకెంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు. అయితే పక్కనే ఉన్న భీమవరంలో ప్రభాస్ సొంత సామాజికవర్గం పట్టు ఎక్కువ. భీమవరాన్ని కేపిటల్ సిటీ ఆఫ్ క్షత్రియాస్ అని పిలుస్తారు. ప్రభాస్ మామూలు సినిమా వస్తేనే ఇక్కడ హంగామా మామూలుగా ఉండదు.
ఇక సాహో లాంటి సినిమా వస్తుందంటే ఇక్కడ ఏ రేంజులో రచ్చ ఉంటుందో ఊహించుకోవచ్చు. సాహో రిలీజ్ సందర్భంగా గురువారం భారీ ఊరేగింపు జరగనుంది. సిటీ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ బైక్ లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ హంగామా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఇక సాహోను భీమవరంలో ఉన్న మల్టీఫ్లెక్స్ లోని నాలుగు స్క్రీన్లతో పాటు అన్ని థియేటర్లలో వేస్తున్నా టిక్కెట్లు దొరకని పరిస్థితి. ఇన్ని థియేటర్లు వేసినా భీమవరంలో ఎర్లీ మార్నింగ్ షోకి టికెట్ రేటు ఒక్కోచోట మూడువేలు పలుకుతోంది.