Begin typing your search above and press return to search.
సాహో బిజినెస్ రేంజ్ ఎంత ?
By: Tupaki Desk | 4 Jun 2019 5:38 AM GMTరోజులు గడిచే కొద్ది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ తారస్థాయికి చేరుకుంటోంది . రెండేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ ధియేటర్లలోకి అడుగు పెట్టబోతున్న సాహో కోసం ఇప్పటి నుంచే ఎలాంటి ఏర్పాట్లు చేయాలా అనే ఆలోచనలో పడ్డారు. టాలీవుడ్ లోనే కాదు ఇండియాకే మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ మూవీగా రూపొందుతున్న సాహో బిజినెస్ డీల్స్ గురించి ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ లో పలు ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
దీని రేంజ్ ని బట్టి ఒక తెలుగు వెర్షన్ నుంచే సుమారు 130 నుంచి 150 కోట్ల దాకా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ చేయొచ్చని అంచనాలున్నాయి. ఎలాగూ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి హింది-తమిళ్-కన్నడ-మలయాళం నుంచి ఎంత లేదన్నా 80 కోట్లకు పైగా ఆశించవచ్చు. అంటే 200 కోట్ల పైచిలుకు కేవలం డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచే వస్తుందన్న మాట. ఇది కాకుండా శాటిలైట్ హక్కులు వేరు. అన్ని బాషలకు కలిపి సాహో సుమారుగా 75 కోట్ల దాకా రాబట్టడం ఖాయమని నిర్మాతల అంచనా.
అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ సైట్స్ ఎంత ఆఫర్ ఇస్తాయో ఊహించుకోవడం కూడా కష్టమే. కనిష్టంగా 30 కోట్లు ఈజీగా పలుకుతుందని ఇన్ సైడ్ టాక్. ఈ లెక్కన సాహో బడ్జెట్ 300 కోట్లు అయ్యింది అనుకున్నా పెట్టుబడి మొత్తం విడుదలకు ముందే వచ్చేస్తుంది.
ఇక్కడదాకా చెప్పిన లెక్కలో ఓవర్సీస్ కలపలేదు. అది ఫైనలైజ్ అయితే అదంతా లాభాల్లోకి చేరుకుంటుంది. ఇంతేసి పెట్టుబడుల వరద పారుతుంది కాబట్టి సాహో విడుదల ఓపెనింగ్స్ మాములుగా ఉంటె సరిపోదు. నెవర్ బిఫోర్ తరహాలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయమని విశ్లేషకుల అంచనా. ఇంకో డెబ్బై రోజులు ఆగితే సాహో అరాచకాన్ని ఇంటా బయటా చూడొచ్చు