Begin typing your search above and press return to search.
10,000 స్క్రీన్లలో `సాహో`?
By: Tupaki Desk | 29 July 2018 9:51 AM GMTప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సాహో దాదాపు 300కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా .. యూనివర్శల్ స్టార్ గా తనని తాను సుస్థిరం చేసుకోవడమే ధ్యేయంగా హై రిస్క్ చేస్తున్నాడు. బాహుబలి సిరీస్ తెచ్చిన క్రేజును నిలబెట్టుకునేందుకు - యూనివర్శల్ యాక్షన్ స్టార్ గా తన బ్రాండ్ ని ఆవిష్కరించుకునేందుకు సాయాశక్తులా ప్రయత్నిస్తున్నాడు.
సాహో 2019 ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటినుంచే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు వేగంగా చక్కబెడుతోంది యువి సంస్థ. అలానే రిలీజ్ కి సంబంధించిన విషయంలోనూ అంతే క్లారిటీతో మూవ్ అవుతోందిట. హిందీ రైట్స్ ని టీసిరీస్ కి చాలా ముందే కట్టబెట్టేసారు కాబట్టి, ఈపాటికే 3500 స్క్రీన్లు కేవలం హిందీ వర్షన్ కే డిక్లేర్ చేసేశారు. హిందీలోనే అంత ఉంటే - తెలుగు రాష్ట్రాలు - తమిళనాడులోనూ 5000పైగా స్క్రీన్లు ఉంటాయనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో చాలా ముందే రిలీజ్ ప్లాన్ చేయాలి కాబట్టి ఈ సమాచారం లీకైంది. ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ గా బాహుబలి చిత్రాన్ని దాదాపు 11000 స్క్రీన్లలో ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీతో సాహో చిత్రాన్ని దాదాపు 10వేల స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు యువి సంస్థ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.