Begin typing your search above and press return to search.
‘సాహో’ టీం ఏం చేస్తున్నట్లు?
By: Tupaki Desk | 6 Jun 2017 10:59 AM GMT‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తన రెండో సినిమాను ప్రభాస్ తో నే చేయాలని మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. ప్రభాస్ ‘బాహుబలి’ నుంచి విడుదలయ్యే లోపు అతను అవసరమైతే రెండు సినిమాలు చేసుకుని ఉండొచ్చు. కానీ ప్రభాస్ తోనే సినిమా చేయాలని పట్టుబట్టుకుని కూర్చున్నాడు. తనకు దొరికిన గ్యాప్ లో స్క్రిప్టు మరింత బాగా తీర్చిదిద్దుకున్నాడని.. ఇక ప్రభాస్ అందుబాటులోకి రాగానే సినిమా మొదలుపెట్టడమే ఆలస్యమని అన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాకు ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. కానీ ఇప్పటిదాకా షూటింగే ఆరంభం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ట్విట్టర్లో సుజీతే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. షూటింగ్ స్టార్ట్స్ సూన్.. అంటూ మెసేజ్ పెట్టాడు.
మరి ప్రభాస్ రెడీగా ఉన్నా.. ఇంకా షూటింగే ఎందుకు మొదలుపెట్టలేదన్నది డౌటు. ఆల్రెడీ ప్రభాస్ లుక్ మారిపోయింది. స్క్రిప్టు రెడీగా ఉంది. అయినా షూటింగ్ ఆరంభించకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నారన్నదే అర్థం కావడం లేదు. టీజర్ కోసం ఒక యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు అప్పట్లో వచ్చిన వార్తలు కూడా అబద్ధమే అని టీజర్ చూసినపుడే అర్థమైపోయింది. జస్ట్ ప్రభాస్ ను అలా కూర్చోబెట్టి ఒక షాట్ తీసేసి.. మిగతాదంతా వీఎఫెక్స్ సాయంతో లాగించేశారు. మరి ప్రారంభోత్సవం జరిగాక సుజీత్ అండ్ టీం ఐదు నెలల నుంచి ఏం చేస్తోందా అని చర్చించుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టి 2018 ఆరంభంలోనే సినిమాను రిలీజ్ చేసేలా చూడాలని.. ‘బాహుబలి’ రెండు భాగాల కోసం నిరీక్షించి నిరీక్షించి అలసిపోయామని.. ప్రభాస్ తర్వాతి సినిమాల విషయంలో అయినా వేగం చూపించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/